ప్రపంచ నేత్ర దినోత్సవం - 11 అక్టోబర్
'ఇంద్రియాణి మనో విషయా: (జ్ణానం) భోగాయతనమిత్యాత్మారామా:'
ఇంద్రియాలు, మనస్సు, భోగ్యవస్తువులు, భోగాలకు స్థానమైన శరీరము - ఇవి ఆత్మ రమించే స్థానాలు, అని సోమదేవుని నీతిసూత్రాలను నీతివాక్యామౄతం అన్న సూక్తిముక్తావళి అన్న రచనలో వివరిస్తాడు.
సర్వేంద్రియాణాం 'నయనం' ప్రధానం - అన్నది చాలా ప్రాచీన నానుడి.
ఇంద్రియాలన్నిటికీ నయనాలు ప్రధానాలు. భగవంతుడు రూపం కల్పించిన భౌతికకాయంలో అన్ని అవయవాలు ఒక ఎత్తు అయితే, మేధస్సుకి, గుండెకి మధ్యన అమర్చిన ప్రత్యేక అంగం నయనాలు, చక్షువులు, అవేకళ్ళు.
మన కళ్ళు
కళ్ళల్లో కళ, వ్యక్తీకరణలో అందం, అక్షరాల్లో కాంతి, జీవితంలో ఔన్నత్యం - నిరాడంబరత నుంచే వస్టాయి అంటాదు ఒక కవి. కళ్ళకు కనిపించే విషయాల ఆధారంగా ఎవరైనా అంచనా చేయవచ్చు; కాని సునిశిత దౄష్టితో అంతర్యాన్ని గ్రహించి అంచనాలు కట్టగలశక్తి కొద్దిమందికే వుంటుంది. కళ్ళు అందాన్ని, ఆనందాన్ని, సుఖదు:ఖాల్ని మాటలు లేని భాషలో వ్యక్తపరుస్తాయి. ఒకవిధంగా చెప్పాలంటే, కళ్ళద్వారా మన ఆలంకారీకులు వర్ణించే నవరసాలను, వాటిద్వారా జనించే భావాలను ప్రకటించుకొనేందుకు వీలు కల్పింపబడిన అధ్బుతసౄష్టి తత్వంలోంచి ఉదయించిన నేత్రాలు మన కళ్ళు.
అనుభూతుల ఏతాలు మన కళ్ళు
గుండెల సముద్రాల్లోని బాధల బడబాగుల్ని తోడి, బొట్లుబొట్లుగా కార్చే అనుభూతుల ఏతాలు కళ్ళు - అని కవి కళ్ళను వర్ణిస్తూ ఒక అనిర్వచనీయమైన అనుభూతిని అందించారు. కళ్ళు లేకపోతే కలియుగమే లేదు - అన్నారు ప్రముఖ కవిపండితుడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ఆత్మబలి అన్న రచనలో. కేవలం కలియుగమే ఎందుకూ, ఆమాటకొస్తే, ఏ యుగంనైనా సరే అని చెప్పాలి. కళ్ళు మనకు భగవంతుడు తన సౄష్టిలో భాగంగా ప్రసాదించినా, అవేకళ్ళు కనుక లేకపోయినా, సరిగ్గా పనిచేయలేకపోయినా, ఆ సౄష్టిని కూడ వీక్షించే నోముకు నోచుకోకుండా పోతారు. కళ్ళ క్రింద ముక్కు, నోరు దగ్గరి నేస్తాలుగా వున్నా, కళ్ళుమాత్రం చెవులతోనే ప్రాణస్నేహం చేస్తూంటాయి. అవినాభావసంబంధం అంటే యిదేనేమో. అందుకే, గోడగోడకూ చెవులుంటాయి, మూలమూలకు కళ్ళుంటాయి - అంటారు పురిపండా అప్పలస్వామి తన రచన పులిపంజా లో. 'కళ్ళులేని వాడుకాక, తన చిక్కులను దాచిపట్టువాడె అంధుడూ అంటాడు మన జాతిపిత, మహాత్మాగాంధి.
మన కళ్ళు - మన సమస్యలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి అంచనాల ప్రకారం, ప్రతీ ఐదు సెకండ్లకు ఒక వ్యక్తిని ప్రపంచంలో అంధత్వం ఆవహిస్తోంది. ప్రతీ నిమిషానికీ ఒక శిశువు చూపుని కోల్పోవడం జరుగుతోంది. ఫలితంగా, అంధత్వం, చూపులోపం విశ్వవ్యాప్తంగా విలయతాండం చేస్తోంది అన్నది మాత్రం సత్యం. ప్రపంచవ్యాప్తంగా, 314 మిలియన్లమంది వివిధ రకాల దౄష్టిలోపంతోనూ, 45 మిలియన్ల మంది అంధత్వంతోనూ బాధపడుతున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. దౄష్టిలోపం కలిగిన వారిలో 75 శాతం మందికి తగిన చూపును పొందే వీలున్నప్పట్టికీ నిర్లక్ష్యం కారణంగా అల్లాడుతున్నారని అంతర్జాతీయ అంధత్వ నివారణ సంస్థ లాంటి సంస్థలు సుస్పష్ఠంగా విశదపరచాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తో సహా పలు సంస్థలు 'చూపూ సమస్యలపై ప్రజలకు తగు అవగాహన కల్పించేందుకు వివిధ స్వఛ్ఛంద సంస్థలతో కలిసి కౄషి చేస్తున్నాయి. 'దౄష్టిపై హక్కూ అన్న యోజన ప్రకారం, విజన్-2020 పేరిట కంటి రక్షణపై, దౄష్టి దోషాలపై, ప్రజలకు అవగాహన కల్పించేందుకు పని చేస్తున్నాయి. ఈ దిశలో ప్రతీ సంవత్సరం, అక్టోబర్ రెండవ గురువారపు రోజున 'దౄష్టి దినోత్సవం' లేదా 'అంధత్వ నివారణ దినం' గా పాటిస్తున్నాయి. సగటు పౌరులుగా, కనీసపు దౄష్టిని కోల్పోయి, తమకున్న హక్కులను విడజారుకుంటున్నారు. వీరి దారుణ పరిస్థితికి వీరు ఎంతమాత్రం బాధ్యుతులు కారేమో అన్న విషయంలో కొంచెం అయినా సమంజసం వుందేమో. ప్రతీ ఏడాది, 1-2 మిలియన్ల అంధులుగా జాబితాలో చేరుతున్నారు. మరొక అంచనా ఏమిటంటే, 75 శాతం ప్రజలకు ఈ రోగానికి నివారణ చేయవచ్చనే కాక, సత్వర వైద్యంతో చూపును పొందుతారు. 90 శాతం మంది అంధప్రజలు అత్యంత బీదదేశాల్లోనే కనిపిస్తున్నారని కూడ వాకబుల్లో తెలుస్తున్న విషయాలు. పైగా, పురుషులకన్నా, స్త్రీల విషయంలో దౄష్టి విషయంలో అపాయం ఎక్కువగా కనిపిస్తోందన్నది కూడ సత్యం. సరియైన సమయంలో కల్పించుకుని, దీక్షతో అంధనివారణకు వైద్యసంబంధిత చర్యలను చేపట్టకపోతే, 2020 నాటికి మరో విడత 75 మిలియన్ల అంధులను జోడించవలసి వస్తుంది అని అందోళన పొందుతున్నారు.
చూపుస్థాయిని పెంచుకోవడం, అంధత్వనివారణకు చర్యలను చేపట్టడం, అందుబాటు ధరలతో, వైద్యానికి కావలసిన ఏర్పాట్లు చేసితీరాలన్నది విశ్వఘోషలో భాగం.
ప్రపంచ నేత్ర దినోత్సవం - 9 అక్టోబర్
దారుణ పరిస్థితిని దౄష్టిలో నుంచుకుని, ప్రపంచవ్యాప్తంగా, అంతర్జాతీయ అంధత్వ నివారణ సమాఖ్య ని స్థాపించడం, అక్టోబర్ నెలలో రెండవ గురువారం, ప్రపంచ నేత్రోత్సవం జరుపాలని నిర్ణయించారు. తమ ప్రణాళికలో భాగంగా, 'విజన్ 2020' ను రూపొందించారు. ప్రతీ పౌరునికి చూపు/దౄష్టి వారి హక్కు అన్న ధోరణికి ప్రచారం చేయడం జరుగుతోంది. చేపట్టే చర్యల్లో భాగంగా, అవగాహనాసదస్సులు, ప్రముఖ అంతర్జాతీయ వైద్య సమస్యగా పరిగణించడం, వివిధ దేశాలని, ఆయా వైద్య మంత్రిత్వశాఖలని జాతీయ అంధత్వ నివారణా కార్యక్రమాలని నిర్వహించాలని, తగిన నిధులను కేటాయించాలని, అక్షరాస్యుల ద్వారా సమస్యను, దాని నివాఋరణ చర్యలను ప్రచారం చేయడం, సమాఖ్య సభ్యులద్వారా తగిన నిధులను, సహాయ సహకారాలను పొందేలా కౄషిని చేయాలని ప్రతిపాదనల్లో ప్రస్తుతించారు. ఈ చర్యలను సత్య, సత్వరంగా చేపట్టినట్టయితే, 100 మిలియన్ల ప్రజలకు అంధులుగా మారడం నుంచి నివారించగలగడమే కాక, దౄష్టిలోపం వల్ల వచ్చే సామాజిక అసమానతలను, విచక్షణలను, వివక్షతను, నివారించడం కూడ ప్రణాళికల్లో ముఖ్యభాగంగా పరిగణించి, అనుకున్న ఫలితాలను సాధించుకోవాలి. పై చర్యలు వెనువెంటనే చేపట్టినట్లయితే, 223 బిలియన్ల డాలర్లు, విజన్ 2020 పుణ్యమా అని, వెనకేసుకోవచ్చు.
నా దౄష్టి నా హక్కు
ప్రతీ పౌరసత్వపు హక్కు, పౌర దౄష్టి హక్కును కూడ కలిగియుండడం అన్నది సమంజసం. ప్రతీ వ్యక్తి, 'నా చూపు, దౄష్టి నా హక్కూ అన్న నినాదాన్ని తీవ్రతరం చేయడమే కాక, అంతర్జాతీయ అంధత్వ నివారణ సమాఖ్య, ప్రపంచ ఆరోగ్య సంస్థ తో పాటు, వివిధ దేశ/రాష్ట్రప్రభుత్వ వైద్యారోగ్య శాఖల ద్వారా ప్రభుత్వేతర, స్వఛ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో పాటు 2020 నాటికి అంధత్వదశను సంపూఋర్ణంగా నివారించగలిగిన పరిస్థితిని అందుకోవాలని, నేను సైతం నా చూపుకు నా హక్కును వినియోగించుకుంటానని, దానికి కావలసిన విధులను కూడ నిర్వహించి సత్ఫలితాలను సాధించాల్సిన తరుణం ఈ సందర్భం.
నా కళ్ళు నా కలలు, నా ఆకళ్ళు
మన కళ్ళ ద్వారా మనకు సంభవించే దౄష్టితో మన జీవితంలోని సౌందర్యానుభూతుల్ని మన చక్షుసంపదతో వీక్షించి రసరమ్యలోకంలో విహరించవచ్చు. ప్రకౄతి అందాన్ని కనులారా గమనించవచ్చు. మన కళ్ళు మనకు కలలు, మన కళ్ళు మనకు ఆకళ్ళు అని చెప్పవచ్చు. ఈ భావానే, ప్రజాకవి కాళోజీ ఎంత చక్కగా వివరించారో :
ఆ కళ్ళ కళలు ఆకళ్ళుఆ కళ్ళు కళల ఆకళ్ళుఆకళ్ళ కలలు ఆకళ్ళుకలల ఆకళ్ళ ఆకళ్ళు.
ప్రేరణ
ప్రేరణ లేకుంటే, ప్రేరణకు జ్ణానం చేయూతగా లేకుంటే, జ్ణానం శ్రమరూపం దాల్చకుంటే, శ్రమ ప్రేమ పూరితం కాకుంటే, జీవితం అంధకారబంధురం - అన్నాడు ఖలీల్ జిబ్రాన్.
లోపిస్తున్న సమన్వయ దౄక్పథం
ముందుచూపును కోల్పోయిన గతదౄష్టి గానీ, వెనుక చూపును నిరసించిన భవిష్యదౄష్టినిగాని, మానవపురోభివౄద్ధికి దోహదకారులు కాలేవు అన్న అభిప్రాయం బలపడినది. ఈ పరిస్థితి తాండవిస్తున్నప్పుడు, కళ్ళు వుండి కూడ గుడ్డివారుగా చలామణీ అవుతున్నారు ఈ కలియుగంలో. ఈ గుడ్డివారు, దురదౄష్టవశాత్తూ చూపుకోల్పోయినవారికి, అంధత్వనివారణకు, ఏవిధమైన సహాయ సహకారాలను లక్ష్యాలను సాధించేందుకు తోడ్పడుతారో ఊహించలేని అయోమయ స్థితిలో వున్నారు అన్నది మాత్రం సత్యం.
ప్రపంచ నేత్రోత్సవం సందర్భంగా, ఈ ధరణి పై నివసిస్తున్న ప్రతీ వ్యక్తికి అవసరమైన దౄష్టిని, చూపుని, ప్రసాదించమని, అంధత్వానికి లోనుగాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలను చేపట్టడానికి సంకల్పదీక్షాకంకణబద్ధుడై మెలగాలని, ఆదిశలో, దశలో పయనించాలని, ఈ లక్ష్యాల్ని సాధించేందుకు ముందుకు పయనించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ ...
ముందు చూపుతోనే కంటి చూపు
ప్రపంచ దౄష్టి దినోత్సవం నాడు, 'ముందు చూపుతోనే కంటి చూపూ అన్న నినాదం పై అవగాహన తీసుకు వచ్చే ప్రయత్నంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అవగాహనా కార్యక్రమాల్లో, ప్రముఖంగా - అభివౄద్ధి చెందుతున్న దేశాలలో ఆరోగ్యంతో పాటు వయో వౄద్ధుల సంఖ్య పెరుగుతూండడం, వయస్సుతో పాటు వచ్చే సమస్యలలో, దౄష్టి సమస్య కూడా అధికంగా సంభవిస్తూండడం, ముఖ్యమైన కారణాలైన కంటి శుక్లాలు, డయాబెటిక్ రెటినోపతి మరియు మ్యాకులోపతి లాంటి రోగాలు సంభవించడం, పొగత్రాగడం వలన పై కారణాలు త్వరితగతిన వచ్చే అవకాశం ఉందని గ్రహించడం, బహిరంగ ప్రాంతాల్లో పొగ త్రాగడం నేరంగాను, పొగ త్రాగకుండా చూడడం మన కర్తవ్యం గాను, అవగాహన కలిగిస్తూ పరిస్థితిని అదుపుచేయడం, నివారించడం లక్ష్యసాధనగా ముందుకు నడవాలి.
వ్యతిగత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించినట్లయితే, కంటి కలకలాంటి రోగాలను కూడ నివారించవచ్చని గ్రహింపచేయడం.
కంటి చూపును కాపాడండి! అది మనల్ని కాపాడుతుంది.
ప్రపంచ దౄష్టి/నేత్రోత్సవం, అంధత్వ నివారణ దినోత్సవం సందర్భంగా, ఈ విశ్వంలో ప్రతి జీవి భగవంతుడు జన్మతో ప్రసాదించిన కళ్ళతో ఈ సుందర ప్రకౄతి సౌందర్యాన్ని, మంచి మనసుల్ని తన కళ్ళతో, లోచూపుతో చూడగలిగి, తన జీవితాన్ని సార్ధకం చేసుకోగలిగితే, యిటువంటి ప్రత్యేక కార్యక్రమానికి లక్ష్యం, సంకల్పం నెరవేరినట్లే. మనందరం ఆ దిశలో పయనిద్దాం. మనకళ్ళతో, మరొకరికి కళ్ళని ప్రసాదిద్దాం.
ప్రపంచ దౄష్టి దినోత్సవం సందర్భంగా, ప్రతీ మనిషికి ఆరోగ్యకరమైన భౌతిక దౄష్టితోపాటు, నిష్కళ్మషమైన మానసిక దౄష్టిని కూడ ఆ పరాత్పరుడు ప్రసాదించాలని, తెలుగురథం మనసావాచాకర్మణా కోరుకుంటోంది.
శుభం భూయాత్.
తెలుగురథం - కొంపెల్ల శర్మ.

No comments:
Post a Comment