నాడు - ఈనాడు
సెప్టెంబర్ ౮ ప్రత్యేకతలు
ప్రముఖ కవి, రచయిత, త్రిపురనేని గోపీచంద్ జయంతి
తెలుగు నవలా సాహిత్యములో క్రొత్త అధ్యాయాలను సృష్టించిన నవలా సాహితీకారుడు, త్రిపురనేని గోపీచంద్. ఆకాశవాణి లో ప్రయోక్త గా సుపరిచితుడు. కథకుడు, వ్యాసకర్త, నాటక రచయిత, చిత్ర దర్శకుడు అయిన గోపీచంద్, ప్రముఖ సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి చౌదరిగారి సుపుత్రరత్నం. మొదలుగా భౌతికవాది, హేతువాది అయిన గోపీచంద్ ని మార్కిసిజపు సాంఘిక న్యాయ సూత్రాల వైపు ఆకర్షితుడయ్యాడు. గోపీచంద్ అనగానే, మనకు మొదటిగా స్ఫురించేది - 'అసమర్ధుని జీవితయాత్ర' ద్వారా, వయుక్తిక ప్రవృత్తి, జీవిత తత్త్వపు చర్చని విస్తృతంగా విశ్లేషించిన విజ్ఞానమూర్తి. హేతువాదాన్ని బలపరుస్తూ, ఎందర్నో హేతువాదములో సుశిక్షితుల్ని చేయడం జరిగింది. సున్నితం, సూటితనం, సంక్షిప్తం త్రివేణీ సంగమమైన గోపీచంద్ సాహితీశైలి కి పరాకాష్ఠ - పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, అన్ననవల కు కేంద్ర సాహితీ అకాడమీ పురస్కారాన్ని పొందడమే కాక, తొలిసారిగా, నవలాప్రిక్రియకు లభించడం విశేషమే కదా. పోస్టు చేయని ఉత్తరాలు, మెరుపు మరకలు, చీకటి గదులు నవలలు, మాంచాల, గ్రుడ్డి సంఘం, అభాగిని, తత్త్వమసి, మాలపల్లి నాటకాలు చదవని తెలుగు సాహితీ ప్రేమికుడు అసంపూర్ణ వ్యక్తే అనే చెప్పాలి. గోపీచంద్ తన ప్రతిభ, చిత్రసీమ లో కూడా కనిపిస్తుంది. గృహప్రవేశం (సంభాషణలు), ప్రియురాలు, పేరంటాలు, లక్ష్మమ్మ (దర్సకత్వం) ఒక పార్శ్వం అయితే, గోపీచంద్ కలం నుండి వెలువడిన 'తత్త్వవేత్తలు' ప్రాచ్య, పాశ్చాత్య తత్త్వవేత్తల జీవిత సంక్షిప్త దృక్పథాలను న భూతో న భవిష్యత్ అనే చెప్పాలి.
ఆధునిక సాహితీయుగపు ప్రతినిధిగా త్రిపురనేని గోపీచంద్ ను స్మరించకుండా, తెలుగు సాహిత్యం అసంపూర్ణం, అసమగ్రం.
తెలుగురధం త్రిపురనేని గోపీచంద్ కు జయంతి సందర్భంగా త్రికరణ శుద్ధి గా నివాళిని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం
3 comments:
శర్మ గారు దయచేసి ఈ క్రింది పదాలను సరిదిద్దగలరు:-
భుతికవాడి,మార్కిసిజపు,వయుక్తిక,బలపర్స్తూ, హేతువాడంలో ,మాలపల్లి నాటకాలు కాదవని ,గోపీచంద్ తన కాలపు వాతాన్ని,పాశ్చాత్య తత్త్వవీతల, జీవిత సంక్షిప్త దృక్పథాలను న భూతో న భవిష్యత్ అనే చెప్పాలి,వర్నించదగ్గ,
రాజెంద్ర గారికి, మీ సలహాకు ధన్యవాదములు. బ్లాగ్ లొనుంచి నేరుగా టైపు చేయడం మూలాన కొన్ని తప్పులు దొర్లాయి. మన్నించవలెను. వ్యాసాన్ని చదివినందులకు మరొకసారి ధన్యవాదములు. సెలవు. కొంపెల్ల శర్మ.
@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: :)
త్రిపురనేని రామస్వామి, ఆయనకి "చౌదరి" తోక తరువాత తగిలించారు..చూడుడు:
http://te.wikipedia.org/wiki/త్రిపురనేని_రామస్వామి
గోపిచంద్ శతజయంతి వచ్చే సంవత్సరం! ఘనంగా జరపడానికి సమాయత్తమవుతున్నారు సాహిత్యాభిమానులు!!
Post a Comment