Tuesday, August 5, 2008

నాడు - ఈనాడు

నాడు - ఈనాడు
ఆగష్టు 5 ప్రత్యేకతల్లో కొన్ని ...
1. చంద్రుని పై తొలిగా తన పాదాన్ని మోపిన 'నీల్ ఆర్మ్ స్ట్రాంగ్' పుట్టిన రోజు

2. ప్రముఖ చలనచిత్ర రచయిత, నిర్మాత, పిల్లల మాసపత్రిక 'చందమామా ప్రారంభంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి - 'చక్రపాణీ (ఆలూరి వెంకట సుబ్బారావు) (5-8-1908 - 24-9-1975) - శతాజయంతి.
పరిపూర్ణ మానవతావాది, సౄజనశీలి, శరత్ సాహిత్యానికి తెలుగులో అందించిన ఘనత యీయనదే. ప్రచురణకర్త, సాహిత్యంలో నూతన శైలిని నిర్మించినవాడు, 'విజయా సంస్థతో భాగస్వామ్యం వహించి, ఎన్నో చిత్రాలు - షావుకారు, మిస్సమ్మ, గుండమ్మకథ లాంటి చిత్రాలను అందించిన నిత్య మథురస్మౄతులను కలిగిస్తున్నారు. ప్రముఖ పిల్లల మాసపత్రిక, కేవలం పిల్లలకే కాదు, అన్ని వయసులవారిని సరిసమానంగా ఆకర్షించిన పత్రిక 'చందమామా యిప్పుడు అంతర్జాతీయ సంస్థ 'వాల్ట్ డిస్నీ' సహకారంతో నూతనత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందంటృఏ, వీరి ప్రతిభ, దూరదౄష్టి అపారం, అద్భుతం అనే చెప్పాలి. చక్రపాని వాక్చతురతకు, సంకల్పసిద్ధికి మారుపేరు. చందమామ యిటీవలే 'షష్టిపూర్తీ జరుపుకోవడం, చక్రపాని గారికి 'అరవై ఏళ్ళ క్రితం వచ్చిన వందేళ్ళ ముందుచూపూ అని ప్రముఖ పత్రిక రచన పేర్కొనడం నిజంగా సమంజసమే. మరొక ప్రముఖ రచయిత తో కలసి, చందమామతోపాటు, 'యువా మాసపత్రికను సమర్ధవంతంగా నిర్వహించడం కూడ ఆయనలోని ప్రతిభామూర్తిత్వానికి నిదర్శనం. ప్రముఖ నటి, రచయిత్రి, నిర్మాత, భానుమతి - చక్రపాణి గారిపై 'రంభా-చక్రపాణీయం' అన్న హాస్య కథ చదివిన వారు మాత్రం, యిద్దరినీ వారిలో శ్వాస ఉన్నంతకాలం మరవడం అన్నది అసాధ్యం.
'చక్రపాణీ అన్న కలం పేరు అని ఎవరూ అనుకోని విధంగా చలామణి చేసుకున్న వీరి అసలు పేరు - ఆలూరు వెంకట సుబ్బారావు. చలనచిత్ర రచయిత, నిర్మాత, దర్శకుడిగా, ప్రచురణకర్తగా బహుముఖీన పాత్రలను బహు ప్రతిభావంతంగా నిర్వహించ గలిగిన ఏకైక వ్యక్తి - చక్రపాణి - ఆ.వెం.సుబ్బారావు గారు, కొడవటిగంటి కుటుంబరావు, నాగిరెడ్డి, బి.యన్.రెడ్డి గార్లకు అత్యంత సన్నిహితుడు, గౌరవనీయుడు, మార్గదర్శి.

3. వర్ధమాన అభినేత్రి, హిందీ చలనచిత్ర నాయకి - 'కాజోళ్' పుట్టినరోజు
తరతరాల వంశ పరంపరగా కళాసేవను చేస్తున్న కుటుంబం. మొన్నటి ప్రముఖ నాయకీమణి 'నూతణ్ కు మేనకోడలు - నిన్నటి తరం నాయకి 'నూతణ్ కి ముద్దుల కూతురు, నేటి వర్ధమాన నాయకీమణి 'కాజోళ్ పుట్టినరోజు (1975), ఆగష్టు 5. ప్రముఖ హిందీ చలనచిత్ర కథానాయకుడైన 'అజయ్ దేవగణ్' ను 1999 లో వివాహమాడడం జరిగింది. ఈ యిద్దరు కళాకారులు హిందీ చలనచిత్రరంగంలో తిరుగులేనివిధంగా తమ ప్రతిభను కొనసాగిస్తున్నారు.

కొంపెల్ల శర్మ - తెలుగురధం.

No comments: