
హేతువాద మార్గదర్శి 'గోరా' ( 1902 - 1975 ) వర్ధంతి
భారతీయ నాస్తికవాద నేత, గోరా అని ప్రసిద్ధి చెందిన, గోపరాజు రామచంద్రరావు, 15 నవంబర్ 1902 న ఉన్నతకుల హిందూ కుటుంబంలో జన్మించారు. నాస్తికవాది అన్నవెంటనే, ఈ వ్యాసం చదవడం మానేసినవాళ్ళు కూడ వుంటారేమో!. గోరా తన ఆత్మకధ లో పేర్కొన్నట్లు, పరంపరగా వస్తున్న సంప్రదాయ, మూఢాచారాలు ప్రబలుతున్న కుటుంబం అని తానే చెప్పుకున్నారు. వౄక్షశాస్త్రంలో డిగ్రీ చదివి, మద్రాసు ప్రేసిడెన్సే కాలేజీలో అదే శాస్త్రంలో మాష్టర్ డిగ్రీలో ఉత్తీర్ణతను పొందారు. 1922 లో సరస్వతిని, ఆమె 10 ఏళ్ళ ప్రాయంలోనే వివాహం చేసుకున్నాడు. వారిద్దరి కుటుంబాలు, హిందూ సనాతన పద్ధతిలోని కుటుంబాలే. వీరిరువిరి కుటుంబాలు, బాల్యవివాహ నిరోధ చట్టం 1975 లో జరిగింది.
నాస్తికవాద ప్రచారం
గోరా రచనలు
ఒక సిద్ధాంతపరమైన భావాలతో జీవితాంతం కౄషిసల్పిన 'గోరా' 1975, 26, జూలైన మరణించారు.
ఏ వాదమైనా, మానవసేవయే మాధవసేవయ పరమ పరమార్ధం
గోరా మరణాంతరం, నాస్తికకేంద్రాన్ని, ఆయన భార్య సరస్వతి పర్యవేక్షణలో, సలహాసంప్రదింపులు, కులాంతర వివాహాలు, వర్ణరహిత వివాహాల కోసం నిరంతర కౄషిని సలిపాడు. బాల్య వివాహాలని నిషేధించడానికి, వేశ్యావౄత్తిలో యిరుక్కుపోయినవారికి సహాయ సహకారాలు, పెళ్ళికాని తల్లులకు సహాయాలు, బీదవర్గపు మహిళలు, మూఢాచార నమ్మకాలపై కౄషిని సలిపారు. వీటికి నిదర్శనగా, మంటలపై నడకలు, యితర మూఢాచారాల్ని తొలగించే ప్రయత్నం జరిగింది. పెళ్ళికి ముందే సెక్స్ పై అవగాహనలు, కుటుంబనియంత్రణ, వీటితో పాటు ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన ఘనత గోరాదే.
2002 లో భారతప్రభుత్వం, తపాలాశాఖవారు, ప్రత్యేక తపాళబిళ్ళను 5 రూపాయల స్ఠాంపుని విడుదల చేశారు. గోరా 100 వ శతాబ్దపు జయంతి సందర్భంగా విడుదల చేశారు.
ప్రముఖ హేతువాద ప్రజ్ఞానమూర్తి గోపరాజు రామచంద్రరావు అన్న 'గోరా' గారికి సవినమ్రంగా నివాళిని సమర్పిస్తోంది - తెలుగురధం.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
2 comments:
గోరా గారి మీద మీ వ్యాసం చూసి చాలా సంతోషం కలిగింది. గోరా గారి కుటుంబంతోనూ , నాస్తిక కేంద్రం తోనూ నాకు సన్నిహిత సంబంధాలు వున్నాయి. ఒకప్పటి తెలంగాణా నాస్తిక కార్యకర్త నాగం గారి అబ్బాయిని నేను.
శరత్ గారికి, గోరా గారిపై వ్రాసిన వ్యాసం పై మీ అభిప్రాయానికి ఆనందించాను. ప్రతీ వ్యక్తి లో ప్రతిభ తప్పనిసరి. సేవాపరంగా మన ప్రతిభకు పని కల్పించాలి. సమాజానికి ఉపయోగపడాలి. మానవసేవయే మాధవ సేవ అంటే, యిదే కదా. ధన్యవాదాలు. కొంపెల్ల శర్మ.
Post a Comment