వైద్యో నారాయణోహరీ - డా. యల్లాప్రగడ సుబ్బారావు ( 1895 - 1948 )
అపర వైద్యనారాయణుడు
" నేను పుట్టుకతో ఏమీ పట్టుకుని రాలేదు; చనిపోయేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళను; నా ఆదాయ వ్యయాలు నా జీవనోపాధికి తగినంత వుండిన చాలు. "
ఎవరివి ఈ మాటలు ? ప్రజాకవి వేమన శతకం లోనివి అనుకుని భ్రమ చెందేందుకు ఆస్కారం వుంది. అనుకుంటే, భ్రమే మరి. కనీసం ఏ రచయితవి, కవివి కానేకావు. కాని ప్రజలకు కవి కన్న హితోధికంగా ప్రజావళి వున్నంతవరకు చిరస్మరణీయంగా, అనారోగ్యం మాట వచ్చినప్పుడల్లా, గుర్తుకువచ్చే, స్మరించవలసిన వ్యక్తి. మన ఆంధ్రుడు. ఈ మధ్య మనం తరచు నెమరువేసి, ఆచరించకుండ, కేవలం మాటద్వారా పేరు సంపాదించుకుందామన్న ధోరణితో, వాడే 'తెలుగువాడి ఆత్మగౌరవం' అన్నదాన్ని, మనసా, వాచా, కర్మణా, నిత్యకర్మిష్టిలా ఆచరించిన వ్యక్తి. విద్యావేత్త, వైద్యవేత్త, తత్వవేత్త, దయామయుడు, నైష్టిక బ్రహ్మచారి, విజ్ణానవైద్యశాస్త్రవేత్త, ప్రగాఢ దైవభక్తిపరాయణుడు.
ఎవరోకాదు ... వైద్యరంగంలో ధౄవతార, మానవాళి కందించిన వైద్య విధానాలు చిరకాలం జీవించేలా చేసిన - డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు.
యల్లాప్రగడ అధ్బుత పరిశోధనల ఫలితాలు
హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాఫికల్ మెడిసిన్ సంస్థ లో చేరి 'ట్రాపికల్ స్ప్రూ వ్యాధిపై పరిషోధన చేసి భాస్వరం రసాయన చర్యలు, ప్రతిచర్యలవల్ల మానవ శరీరంలో కండరాల సంకోచ వ్యాకోచాలకు సంబంధించిన రయస్యం కనుగొన్నారు. ఈ ప్రక్రియను ఆయన సహపరిశోధకుడు డాక్టర్ సైరస్ ఫిస్క్ పేరును కలిపి 'సిస్క్-సుబ్బారావు మెథడ్' గా వ్యవహరిస్తారు. 'ట్రాపికల్ స్ఫ్రూ' వ్యాధికి మందును ఆయన కనుగొన్నారు.
వైద్యులకోసం ప్రత్యేకంగా అంకితమైన రోజు - 1 జూలై రోజునే డా. ఎల్లాప్రగడ సుబ్బారావు గారి జయంతి కూడ రావడం మరింత సంతోషదాయకం. వీరు విశ్వవ్యాప్తంగా వైద్యరంగంలో చేసిన సేవలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం, తెలుగు పౌరుడిగా మన కనీస కర్తవ్యం.
డా. యల్లాప్రగడ సుబ్బారావుగారి ప్రతిభకు ప్రణామాలు సమర్పిస్తూ -
కొంపెల్ల శర్మ - తెలుగు రధం.
No comments:
Post a Comment