'కాశీనాధునీకి నివాళి (26 మార్చి 1938 వర్ధంతి)
చదువు, చిరువ్యాపారోద్యోగ పర్వాలు
కాశీనాధుని నాగేశ్వరరావు (పంతులు) గారు నేటి తరానికి ఆంధ్ర (దిన, వార)పత్రిక, భారతి సాహిత్య పత్రిక ల వ్యవస్థాపకునిగాను, స్వాతంత్ర్య సమరయోధులు, దేశోరాద్ధక బిరుదాంకితులు, చేతికి ఎముక లేకుండా దానధర్మాలు చేసిన మహానుభావులు. నాగేశ్వరరావుగారు పంతులు గారిగా చిరప్రసిద్ధులు. ఆయన పత్రికాధిపతి, జాతీయవాది, రాజకీయవాది గా బహుప్రసిద్ధులు. ఖాదీ ఉద్యమంలోను, స్వాతంత్ర్యోద్యమంలోను, భారత జాతీయ కాంగ్రేస్ కార్యక్రమాల్లోనూ ప్రముఖ పాత్ర వహించిన కాశీనాధునివారు, ఆంధ్రలో గ్రంధాలయోద్యమానికి ఆద్యులని చెప్తారు. సమాజనిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహంలోనూ, ఆంధ్రుల్లో చురుగ్గా పాల్గొన్నవారిలో పంతులుగారు ప్రముఖులు. దేశవ్యాప్తంగా ప్రజాసేవలందించినందుకు 'దేశోరాద్ధకా, బహుముఖప్రజ్ణాపాటవాలకు గుర్తింపుగా, ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారు 'కళాప్రపూఋర్ణా (1935) తో సత్కరించారు.
కౄష్ణాజిల్లాలోని 'ఎలకుర్తీ లో బుచ్చయ్య - ష్యామలాంబ లకు 1867 మే 1 న జన్మించిన ఈ ఆంధ్ర బ్రాహ్మణ బిడ్డ, స్వంతూరు, మచిలీపట్నంలో చదువుకుని, మద్రాసు క్రిష్టియన్ కాలేజిలో (1891) లో చదువుతూ, డా.మిల్లర్ అంతేవాసిత్వం, 'వివేకవర్ధనీలో కందుకూరి వారి రచనలను చదివి చాలా ప్రభావితులైనారు.
మద్రాసులో వ్యాపారం, కలకత్తా, బొంబయ్ లో చిరుద్యోగాలు, స్థిరత్వాన్ని యివ్వకపోగా, వ్యాపారంపైనే దౄష్టి సాగుతున్నందున, సర్వరోగనివారిణి, సంజీవనీ ఔషధం 'అమృౠతాంజణ్(1893) ని సౄష్టించి, స్వంతవ్యాపారదక్షుడుగా మారారు.
పత్రికారంగం - 'ఆంధ్రపత్రికా, 'భారతీ ల ఆవిర్భావం
అట్లాంటిక్ - 'పులిట్జఋ తో సరిపోల్చగల ఈ సాహిత్య, పత్రికారంగ పిపాసి, ముంబాయిలోని తెలుగు ప్రజలకు సేవలనందించే ప్రయత్నంలో, 1907 లో జరిగిన సూరత్ - కాంగ్రేసు సమావేశానికి వెళ్ళి, స్వాతంత్ర్యోద్యమంలో చేరాలని సంకల్పించి, తెలుగు ప్రజలకు ఒక తెలుగు పత్రిక అవసరాన్ని గుర్తించి, 1909 లో 'ఆంధ్రపత్రిక, వారపత్రికను ముంబైలో ప్రారంభించాడు. 1914లో మద్రాసుకి తరలించి, దినపత్రికగా మార్చారు.
దేశోద్దారక - విశ్వదాత
మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ప్రత్యాకాంధ్రకై ఉద్యమానికి చేయూతనివ్వడం, ఈ దిశలో అనేక రచనలను చేయడం, ఆంధ్ర జాతికి, భాషకు, సంస్కౄతులపై విశిష్ట సేవలకు పులకించి, 'దేశోద్ధారకా సత్కారాన్ని ప్రసాదించిన ఆంధ్రులు కౄతజ్ఞతలను చూపుకున్నారు. 1926 లో 'ఆంధ్రగ్రంధమాలాను స్థాపించి, ప్రాచీన, వర్తమాన సాహిత్యాన్ని ప్రచురించి, సామాన్యునికి అందుబాటులో వుండేట్లు చేయడం, విజ్ణానసర్వస్వాన్ని అందజేయడం, ఆంధ్రగ్రంధాలయోద్యమానికి శ్రీకారం చుట్టారు. నిరాఘాటంగా రెండు దశాబ్దాలుగా జరిగిన ప్రచురణ సేవలు, ఆనాటి ఆంధ్రజిల్లాల్లో 120 గ్రంధాలయాలు ఉద్భవించాయి.
రాజీలేని రాజకీయయానం
ప్రకాశంపంతులుగారి సాహచర్యం, ఆంధ్రకాంగ్రేసుసంస్థకు దశాబ్దకాలంపాటు (1924-34) అధ్యక్షునిగాను, గాంధీజీ పిలుపందుకుని అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం, పంతులు గారికి చాల పేరు, ప్రఖ్యాతులు పొందారు.
జైలు లో భగవద్గీతకు వ్యాఖ్యానం
1931 లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు, ఆర్నెలల జైలువాసంలో, భగవద్గీతకు భాష్యం వ్రాయడం కాక, గీత కేవలం ఒక మతానికి సంబంధించినది గాదని, విశ్వమానవాళికి చెందిందని, ఆధ్యాత్మిక, యోగసారమని, విశ్వసంపన్నతకు దారితీస్తుందని, నొక్కి వక్కాణించారు.
గాంధీ మాటల్లో 'విశ్వదాతా
కాశీనాధునివారి నివాసం - నిత్యం అతిధులు, అభ్యాగతులు,కవులు, రచయితలు, రాజకీయవాదులు, స్నేహితులు, బంధువర్గాదులతో కళకళలాడడం, వచ్చినవారు ఎవరూ, కాళీ కడుపుతోగాని, ఖాళీ చేతులతో వెళ్ళడం జరిగేది కాదట. నిత్యం దాన, ధర్మ క్రియలతో విరాజిల్లేదట. ఈ తంతుని ప్రత్యక్షంగా చూసిన గాంధీ, 'విశ్వదాతాగా సత్కరించడం ఆయన వాత్సల్య, మానవతా ధోరణులకు తార్కాణం.
కాశీనాధుని వారి తెలుగు-వెలుగు సేవలు
ఆంధ్ర దిన, వార పత్రిక, భారతి - సాహిత్యపత్రిక, ఆంధ్రగ్రంధమాల, పండుగ ప్రత్యేక సంచికలు, బసవపురాణం, పండితారాధ్యచరిత్ర, జీర్ణవిజయనగరచరిత్ర, తంజావూరాంధ్రనాయకులచరిత్ర, మాలపల్లి, గాంధీ ఆత్మకథ, అనేక రచనలు, వ్యాసాదులతో పాటు, 'కొమర్రాజు లక్ష్మణరావూగారి 'ఆంధ్రవిజ్ణానసర్వస్వం' (1938) చాలా కీర్తి, ప్రతిష్టలను తెచ్చిపెట్టాయి. విజ్ణాన సర్వస్వం - ఈయన కలలపంట, తమిళ, మరాఠీల మాదిరి సమగ్రాంధ్ర విజ్ణానసర్వస్వం, రాకపోవడం నిరాశకు గురిచేసింది.
దేశోద్ధారకుడు, విశ్వదాత, కళాప్రపూఋర్ణ - కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు - 26 మార్చి 1938 న కీర్తిశేషులయ్యారు. కాని, నేటికీ, కా.నా.పంతులుగారు, ఆంధ్రుల హౄదయాల్లో సుస్థిరపీఠాన్ని వేసుకుని, మనందరిని నిత్యం ఆశీస్సుల్ని అందింస్తూనే వున్నారన్నది సత్యం. ఆ మహాత్మునికి నివాళిని సమర్పించడం మన కనీసకర్తవ్యం, విధి.
1 comment:
చాలా మంచి విషయాలు చెప్పారు. ఒక చిన్న చేర్పు:
పంతులుగారు మరొకందుకు కూడా ప్రసిద్ధులు..
మద్రాసులోని ఆయన ఇంటి పేరు "శ్రీబాగ్". కోస్తా రాయలసీమ నాయకుల విభేదాలు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమానికి అవరోధంగా నిలిచినపుడు, ఆయన ఇంట్లోనే చర్చలు జరిపి ఒక ఒప్పందం కుదుర్చుకుని, విభేదాలను తొలగించుకున్నారు. దాన్నే శ్రీబాగ్ ఒడంబడిక అంటారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ఈ ఒడంబడిక ఒక మలుపు.
Post a Comment