అంతర్జాతీయ మహిళా సంవత్సరం
"యత్రనార్యస్తు పూజ్యంతే - రమంతే తత్ర దేవతా: - యత్రై వాస్తు నపూజ్యంతే - సర్వాస్తత్రా ఫలా: క్రియా:" (మనుస్మౄతి)
'ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు క్రీడిస్తారు. ఎక్కడ పూజింపబడరో అక్కడ అన్ని కార్యములు నిష్ఫములు." అన్నది భారతీయుల ఆదర్శం - చాలా ప్రాచీనమైంది.
"సంఘములోనూ కుటుంబంలోనూ అత్యున్నతమైన స్థానం స్త్రీలకు కల్పించిన భారతీయుల నాగరికత సంస్కౄతి అతి ప్రాచీనమైనవి. హిందూమతములో వేదాలు కల్పించినట్లు మరే మతములోను స్త్రీలకు ఉన్నతస్థానం కల్పింపబడలేదు. వారి నాగరికత సంస్కౄతి జ్యూస్ నాగరికత సంస్కౄతులకంటే పురాతనమైంది.' అని ఫ్రెంచి రచయిత అయిన లూయిస్ జాకానియట్ భారతదేశాన్ని గురించి వ్రాసిన అనుభూతి.
సుదీర్ఘ మహిళాప్రస్థానం
స్త్రీ నిజమ్ముగ సౄష్టికి జీవగర్ర. తనకంటూ జీవితంలో స్థానాన్ని ఏర్పరచుకోలేకపోయిన మహిళ గురించి, మహాభారతకర్త తిక్కన చెప్పాడు - బాల్యమున తండ్రి, యౌవనప్రాప్తికాలంలో మగడు, వార్ధక్యమున తనయుడి ఆధీనంలోనే గడచిపోతుంది. భారతనారి నాడూ - నేడూ అని విశ్లేషణ చేయాలంటే, సమన్వయాధోరణికి, నిర్మాణాత్మక దౄక్పధానికి, విశిష్టమైన ఆలోచనాపద్ధతికి, ఉదాత్తమైన హౄదయ సంస్కారానికి, మహిళ నిదర్శనంగా అభివ్యక్తమవుతోంది. 'స్త్రీపుంసహోగోద్భవామైన ఈ జగత్తును అర్ధం చేసుకుని సుఖమయంగాను, రసమయంగాను, రమణీయంగాను రూపొందించుకోవడానికి ఉద్యమించాల్సిన మానవజీవితంలో స్త్రీ పాత్ర ప్రాధాన్యతని అన్యధా వివరించవలసిన పనిలేదు, రాదు. సౄష్టిలో పురుషుదు ప్రధానుడేకాక, ప్రధముడు. ముందుగా ప్రజాపతి ఒక్కడే సౄష్టింపబడడంచేత ఒంటరిగా బ్రతకలేక తన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి అతడు తనదేహాన్ని రెండు ఖండాలుగా చేసుకుని, ఆ రెండవ ముక్క స్త్రీ మూర్తిగా తెలిసి, అతడికి అంతులేని ఆనందాన్ని కలిగించింది. ఇలా పతనంచేత ఏర్పడ్డారు కనుక ఆ స్త్రీ పురుషులిద్దరికీ పతి, పత్ని అన్న పేర్లు వచ్చాయి. పతి - భరించేవాడు; పత్ని - భరింపబడేది అని అర్ధాలు పాతుకుపోయాయి. పురుషుడే అధికుడు అన్న వాదాన్ని సౄష్టించి బృహదారణ్యకోపనిషత్తు లో తొలి బలఛాయలు కనిపిస్తాయి. యిలాంటిదే ఒక కధనం క్రైస్తవంలోకూడ ఉందని చెప్తారు. పురుషుడికి సమస్త సౌకర్యాలు ఉన్నా, తన జీవితంలో అవ్యక్తమయిన వెలితి బాధించడం, దేవుడు మానవుడి ప్రక్కటెముక తీసి స్త్రీగా మార్చాడన్న కధనానికి పోలికలు ఉండడం ఆసక్తికరం. రెండు ఖండాలుగా. ఈ స్థితినుంచి, వేదకాలంలో అసమానమైన పాండిత్యాన్ని చూపించిన లోపాముద్ర, విశ్వవార మొదలైన స్త్రీలు చిరస్మరణీయులుగా నిలిచిపోయారు. మనుస్మౄతి, యాజ़్జవల్క్యస్మౄతి లో స్త్రీధనం గురించి నిర్ధారణలు, హిందూ స్త్రీల వారసత్వాధికారాల్లాంటి వివరణలు గౌతమముని మానవ ధర్మ సూత్రాలను ప్రమాణపూరితంగా నిర్ధారించడం జరిగింది. ఫలితంగా, 'నస్త్రీ స్వాతంత్ర్య మర్హతీ అన్న మనుశాసనం చెలామణీ చాలాకాలం అయింది. 11వ శ. లో విజ़్జానేశ్వరుడి భాష్యం 'మితాక్షరీ ద్వారా స్త్రీలకు హక్కులు, అధికారాలూ రేఖామాత్రంగానైనా లిఖితమయ్యాయి. సమాజాభ్యుదయం దౄష్ట్యా, వివాహాది కర్మలు ధర్మశాస్త్రానుసారంగా అగ్నిసాక్షిగా నిర్వహించాలని సూత్రీకరించినా, క్రీ.పూ.4వ శ. లో ప్రముఖ అర్ధశాస్త్రవేత్త కౌటిల్యుడు, వివాహాన్ని స్త్రీలు రద్దుచేసుకోవడం, పునర్వివాహాది సదుపాయాలు స్త్రీజనాభ్యుదయం వైపు ప్రవేశపెట్టడం జరిగింది. కాలమాన స్థితిగతులననుసరించి నిర్దేశింపబడిన శాస్త్రాలు కౌటిల్యుడు స్త్రీలకు అనుకూలంగా నిర్ధారించడం గమనార్హం. సమాన స్వాతంత్ర్యం, ఆర్ధిక సమత్వం లాంటివి ఆపస్తంబుడు, మనువుల ద్వారా స్త్రీలకు ధర్మశాస్త్రాల్లో యధాశక్తిగా గౌరవంగా నిర్ణయింపబడ్డాయి. క్రమంగా మాతౄదేవత, ఇహదైవం, స్త్రీల పట్ల సత్పురుష ప్రవర్తనం, పరస్త్రీని తల్లిగా భావించడం సంస్కౄతీ పరంపరలో అంతర్లీనమయ్యాయి. మధ్యకాలం, మహమ్మదీయుల కాలం, ఆంగ్లేయుల పరిపాలనాకాలం, నవీనశైలితో స్వాతంత్ర్యసమరరంగం, స్వాతంత్ర్యభారతావనిలో వచ్చిన అభ్యుదయాత్మకమైన మార్పులు, స్త్రీలకు వారసత్వాధికారాలు, క్రమంగా ప్రవేశించాయి. మహిళ ను మహారాణిగా మార్చే ప్రయత్నాలు చేయడంలో ముందంజలు వేయడం మాత్రం జరిగింది. కాని, ఫలితాలు, ఆచరణల విషయంలో మాత్రం - స్త్రీ అంటే - బలహీనురాలు, అబల, పురుషుడికి భోగ్యవస్తువు, అదొక జాతి, కులం, వర్ణం, మతం అనే స్థాయి రావడం, ఈ భావన, అనుభూతి సుప్రతిష్ఠతమైపోయింది. స్వార్ధపూరితమైన భావనలో, ఆచరణల్లో స్త్రీని అవమానపరచటం, వివక్షతని ప్రదర్శించడం, మానసికంగా, భౌతికంగా క్షోభకి గురిచేసెనా, స్త్రీ గౌరవం, పరువు, ప్రతిష్ఠ, అభివౄద్ధి, విజ़్జానం, వివేకం లాంటి ఆలోచనలకు రూపులొచ్చాయి. సమానహోదా, సమష్టిజీవనం దాంపత్యానికి మూలం, సంఘానికి పునాది అన్న భావన ఆచరణకు నోచుకుంది. స్త్రీ అంటే, తల్లి, భార్య, కుమార్తె అన్న ముఖ్యమైన త్రిమూర్తి అవతారాలు నేటి సమాజంలో ముఖ్యమైనవిగా మారిపోయాయి.
మహిళ మహిమాన్వితం
స్త్రీ ఉంటేగాని సౄష్టి జరగదు. నమమాసాలూ మోసి, కని, స్తన్యమిచ్చి పెంచేది స్త్రీ. పురుషుడి ఇహ పర సుఖాలకు ఆటపట్టయి, అతడి ప్రశాంత జీవితానికి మూలమయినది, స్త్రీ. ఆమెవల్ల తనను తాను ఉత్తేజపరచుకునేది పురుషుడు. పురుషుడిలో అర్ధభాగం స్త్రీ. స్త్రీ కుటుంబానికి సంఘానికి జీవగర్ర, ప్రాణవాయువు. ఆమెను గౌరవించి, గౌరవం పొందాలన్న భావం సమాజంలో సంస్కారభావాలు సహజంగా మరింత విస్తౄత స్థాయిలో ఉత్పన్నం కావాలి. మనసులో సంస్కారం లేకపోయిన తరువాత ఎన్ని చట్టాలు వచ్చినా, శాసనాలు వచ్చినా ప్రయేజనం లేదుకదా. మేధావులూ, రచయితలూ, సంఘసంస్కర్తలూ, రాజకీయవేత్తలూ ఈ సత్యాన్ని గ్రహించలేనంతకాలం, మహిళలకు మహోన్నతి అన్న భావనమాత్రం బూటకం, కుహనావిధానం అవక తప్పదు. భావసమైక్యత, జాతీయ సమైక్యత, సహాయసానుభూతులు, స్త్రీపురుషులపట్ల ఉభయతారకంగా జనించాలి. మల్లెపందిరిలా వ్యాపించాలి. మొగలిరేకులా సువాసనలను అందించాలి. సంపెంగలా సంతరించాలి. హౄదయవైశాల్యం, హౄదయసంస్కారం ఒకేసారి అవతరించాలి. వినియోగబడాలి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
సరిగ్గా వందేళ్ళ క్రితం, అంటే మార్చి 8 న అంతర్జాతీయ స్థాయిలో మహిళల స్థితిగతులపై చర్చలు, సంప్రదింపులు జరిగాయి. 1911 నుంచి క్రమంగా ఉత్సవాల్ని జరుపుకోవడం ప్రారంభమైంది. 'వేల సంవత్సరాలుగా సామాజికంగామహిళలుహీనస్థితిలో ఉండిపోవడానికి కారణాలను పురుషులు తయారు చేసిన చట్టాలు, ఆర్ధిక సంబంధాల నేపథ్యంలోనే చూడాలీ అన్న క్లారా జెట్కిన్ జన్మనీలో 'సమానత్వం' అనే పత్రిక నిర్వాహకురాలి అభిప్రాయం నేటికీ సత్యంగానే గోచరిస్తోంది. వందేళ్ళక్రితమే, రోజా లగ్జెంబర్గ్ ఆధ్వర్యంలో పోలిష్ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ప్రణాళికలోని డిమాండ్లను పరిశీలిస్తే - స్త్రీలకు నష్టం కలిగిస్తున్న సివిల్, క్రిమినల్ చట్టాల రద్దు, స్త్రీ వ్యక్తిగత స్వేఛ్ఛను హరించే చట్టాలపై వేటు, స్త్రీలకు ఆస్తి, సంతాన హక్కులు, మగవారితో సమానంగా రాజకీయ స్వేఛ్ఛ, సమానత్వం, పరిశ్రమలో పనిచేసే స్త్రీలకు రక్షణచట్టం, లాంటి విషయాలు ఎంతవరకూ ఆచరణకు వచ్చి ఫలితాలను సాథించారన్నది అనుభవం, అనుభూతి పరంపరలే కాని కొలవలేని పరిస్థితి.
నేటి స్థితిగతుల మధ్య మన మహిళ
2001 జనాభా లెఖ్ఖల ప్రకారం, దేశంలో 48% జనాభా మహిళలు అని చెప్పగా, జాతికి అతిముఖ్యమైన భాగం. దేశపు ఆర్ధిక, సమాజ, రాజకీయ రంగాలపై తీవ్రమైన ప్రభావాన్ని, ప్రేరణని కలిగిస్తున్న వర్గం, మహిళలు అన్నదాంట్లో అతిశయోక్తి లేదు. మన రాజ్యాంగం పొందుపరచిన మహిళలకు సంబంధించిన అంశాలను చెప్పాలంటే - సమాన హక్కులు, అవకాశాలు (14), జాతి, వర్గం, కులం, లింగ విషయాలపై వివక్షత. మహిళలకు సహాయసహకారాలను పొందే మార్గంలో చట్టాలు (15), ఉద్యోగాల భర్తీలో సమానత్వం (16), జీవనోపాధికై, సమవేతనంకోసం పురుషులకీ, స్త్రీలకీ ఒకే చట్టం, న్యాయం (39), పనితీరులో, ఆడవారి కానుపు, పురుడి విషయాల్లో సహాయం(42), మహిళల ఆత్మగౌరవం, స్థాయిని పెంచేదిశలో అంశాలు(51), ముఖ్యంగా పేర్కొనాలి.
మరువలేని, వీడలేని అంశాలు
అంతర్జాతీయ ప్రమాణాల్ని భారతదేశం అంగీకారంతో దత్తత తీసుకున్న మహిళా సంబంధిత అంశాలను - బీదతనం, అక్షరాస్యత, విద్య తత్సంబంధిత శిక్షణ, ఆరోగ్యం, హింస, ఆయుధహింస, ఆర్ధికం, సాధికారత, నిర్ణయాధికారాలు, పురోగతితో ముందుకు పోవడం, మానవ హక్కులు, పత్రికలు-మాధ్యమ రంగం, పర్యావరణం, చివరిగా చెప్తున్నా ముఖ్యమైనది, మొదట చెప్పవలసిన అంశం - ఆడపిల్లపై విషయాలు. యిందులో మనదేశం, మిగతా దేశలతో పోలిస్తే, చెప్పుకోదగ్గ అభివౄద్ధి సాధించినా, యింకా సాధించవలసినది ఎంతో, మరెంతో వుంది. సరిగ్గా కొలవడం సాధ్యమవదు కాని, అవ్వయార్ ప్రసిద్ధ సూక్తి - 'మనిషి నేర్చుకున్నది అరచేయంత, నేర్చుకోవలసింది అపార జలధియంతా అన్నది మాత్రం మహిళాభివౄద్ధి, మహిళా సాధికారత ల విషయాల్లో కూడ అదే వర్తిస్తుంది.
విశ్వమహిళ లో భారత మహిళ స్థానం
భారతీయ మహిళాసాధికారత పై 11వ పంచవర్ష ప్రణాళిక - సంఘం తీర్మానించిన విషయాలను పరిశీలిస్తే, భారతదేశం ఈ దుస్థితిలో కొట్టుమిట్టాడుతూంది.
- ప్రసవంలో శిశు మరణాల విషయంలో లక్షమందికి 407 అయితే, 92 (శ్రీలంక), 56 (చైనా), 130 (వియత్నాం) గా 2000 గణాంకాలు చెబ్తున్నాయి.- హెచ్.ఐ.వి./ఎయిడ్స్ విషయంలో, 18-24 సం. మధ్య గర్భిణుల్లో 1 శాతం వరకూ విస్తరిస్తున్న వైనం.- 1991-2001 దశకంలో ఆడపిల్ల పుట్టుకల్లో 945/1000 నుంచి 927/1000 వరకు తగ్గుదల - ముందటి పరీక్షల వల్ల.- అక్షరాస్యతలో మెరుగుదల ఒక మంచి మార్పు. యింకా సాధించాల్సినది చాలా వుంది కూడా.- పనిలో, జీతాల్లో తేడాలు.- మహిళలపై హింస, నేరాలు, ఘోరాలు పెరుగుతున్న దుస్థితి.
అంతర్జాతీయంగా పరిశీలిస్తే, ప్రతీ ఏట 20 కోట్లమంది మహిళలు తప్పిపోవడం, 7-40 లక్షలమంది వ్యభిచారంలోకి నెట్టివేయబడడం, ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక స్త్రీ శారీరక సంబంధాల వలన హింసకు గురవడం - ముందున్న ప్రస్థానం ఎంతో, మరెంతో అనిపిస్తుంది.అంతేకాక, భారతంలో, ప్రతి 34 నిమిషాలకు ఒక స్త్రీ బలవంతానికి గురవడం, 42 నిమిషాలకు లైంగిక వేధింపులకు గురవడం, 43 నిమిషాలకు కిడ్నాపు చేయబడడం, వరకట్న హత్యకు గురవడం, బలవంతపు దారులకు గురవుతున్న మహిళల్లో 25 మంది 16 ఏళ్ళ లోపువారే అన్న సత్యం, దారుణం, అమానుషం, అన్న పదాలు చాలా సామాన్యపదాలు. గర్భస్థ వ్యాధులతో మరణాలు, ఏయిడ్స్ మహమ్మారితో మరణాలు, తగ్గుతున్న మహిళా అక్షరాస్యత శాతం ఆందోళనకు గురి చేస్తున్న చేదు నిజాలు.
మన ప్రణాలికలు - లక్ష్య లక్షణాలు
- మహిళాభివౄద్ధి కొరకు అర్ధవంతమైన పెట్టుబడులు పెట్టాలనేది ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి లక్ష్యం.
- జపాన్ లో ప్రతి యింట్లో 'మదర్స్ రూం' ఉంటుంది; దేవాలయానికి వున్న పవిత్రత ఆ గదికి కేటాయించడం మహిళాసాధికారతకు నిజ ఉదాహరణం.
- చట్టపరమైన రక్షణలు పెంపొందిచడం, అంతర్జాతీయంగా మహిళాభ్యుదయం పట్ల మద్దతును సమీకరించడం, శిక్షణా, పరిశోధన కార్యకలాపాలను నిర్వహించడం, గణాంకాలు సేకరించడం, వెనుకబడిన మహిళలకు నేరుగా సహాయాన్ని అందించడం మహిళలకు సంబంధించి వివరించిన ఐక్యరాజ్యసమితి వివరించిన పై లక్ష్యలక్షణాలు.
- మహిళాదినోత్సవాన్ని రష్యాలో అధికారిక సెలవుదినంగా, 'ది హీరోయిన్ ఉమెన్ వర్కఋ రోజుగా పరిగణించడం. ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాలు మహిళా దినోత్సవానికి సెలవు ప్రకటిస్తున్నాయి.
మహిళాదినోత్సవం సందర్భంగా సెలవుదినం
ప్రపంచవ్యాప్తంగా 17 దేశాలు మహిళా దినోత్సవానికి సెలవు ప్రకటిస్తున్నాయి. మనం చాలాకాలం రాజకీయ పరిపాలనా సమన్వయం పాటించిన రష్యాలో కూడ మహిళాదినోత్సవపు రోజు అధికారిక సెలవుదినంగా పరిగణిస్తారు. అయినా, ఈ సంప్రదాయాన్ని భారతదేశం పాటించకపోవడం దురదౄష్టకరం.
మనకు తిరుగులేని పరిపాలనా నియంత, ఏకైక ప్రధానమంత్రిణి అయిన యిందిరాగాంధి హయాం లో కూడ ఈ మహిళాదినోత్సవం సందర్భంగా సెలవుదినం ప్రకటించకపోవడం అన్యాయం, దురదౄష్టం.
ప్రస్తుతం మన రాష్ట్రపతి, మహిళాప్రతినిధి - ప్రతిభాపాటిల్ - హయాం లోనైనా కనీసం ఈ సెలవుదినంగా ప్రకటించడం వస్తే హర్షణీయం. లేదా, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శతౄవులు అన్నది నగ్నసత్యం అని నిరూపణ అవుతుంది.
మహిళలపై మహితాసూక్తులు
ఎన్నో మహత్కార్యాలకి శ్రీకారం చుట్టించేది స్త్రీమూర్తే!
నారీజాతి పవిత్రమైన శ్రద్ధకి ప్రతిరూపం.
పురుషులు నియమావళిని రూపొందిస్తే, స్త్రీలు ప్రవర్తనావళిని సౄష్టిస్తుంటారు.
మనిషికి చక్కటి ప్రవర్తన నేర్పేది స్త్రీ జన సాంగత్యమే.
ఓ అందమైన చిరునవ్వు ముఖానికి చక్కటి అలంకారమైన వన్నె తేవడమే కాదు; హౄదయానికి సైతం నులివెచ్చని ఆగ్లాదాన్ని అందిస్తుంది.
ప్రేమ అనేది లేకపోతే ఈ భూమి ఓ మరుభూమిగా మారిపోతుంది.
మగవారికి చక్కటి దౄష్టి వుంటే ఆడవారికి అరుదైన దివ్యదౄష్టి వుంటుంది.
నారీహౄదయంలోని కరుణ భావనలు ఈ ప్రపంచంలో అంతర్లీనమైన ఉన్నత వికాసాన్ని సౄష్టిస్తుంటాయి. ఆ వికాసం ఆధారంగానే ఎన్నో మంచి నడవడికలు ఊపిరి పోసుకుంటాయి.
తన భార్యని అపూర్వమైన మన్ననకీ, మర్యాదలకీ అధికారిణిగా చేసేవాడే యోగ్యుడైన భర్త అవుతాడు.
ప్రపంచంలో బలం అందరికీ ఒకేలా వుండదు. స్త్రీల బలమైతే, వారు పాటించే సేవానిరతిలో వుంటుంది.
మాతౄత్వం అనేది దీర్ఘ తపస్సు.
శిశువుకి శుశ్రూషలందజేయడం వల్ల అమ్మని 'శక్తీ అంటాం.
అందం నడవడికలో వుంటుంది; ఆడంబరాలలో కాదు.
ప్రపంచంలో ప్రతి మనిషికీ - ఎనిమిది గుణాలుండాలి అని, వాటిలో మొదటిగా, వయసులో వున్న ఆడవారి పట్ల మధురంగా ప్రవర్తించగలగడం.
కడదాకా సాహచర్యాన్ని నిర్వర్తించేది యీ ప్రపంచంలో భర్తకి భార్య, భార్యకి భర్త మాత్రమే.
ఈ ప్రపంచంలో మనిషి ఆరు రకాల సుఖాలు ఉంటుంటాయి. అందులో, ఎంతో ప్రియంగా వుండి మధురమైన సంభాషణలు అందించే భార్య - ప్రముఖ సుఖం.
మంచి యోగ్యతకల భార్య కుటుంబం మొత్తానికీ అన్ని మంచి కళలూ వున్న గౄహలక్ష్మిలాంటి అందం.
ప్రతి స్త్రీకి భూమాతకి వుండే ధైర్యమూ, శాంతి సిరులూ, బోలెడంత సహనగుణమూ వుంటాయి.
ఎక్కడైతే, స్త్రీలు పూజింపబడతారో, అక్కడ దేవతలు ఆనందంతో శోభిల్లుతుంటారు.
పురుషుడికి స్త్రీని మించిన బంధువు యింకెవరూవుండరు.
స్త్రీ నిష్ఠగా ఓ పని మొదలెట్టిందంటే,పర్వతాలనైనా కదిలించి వేయగలుగుతుంది.
పురుషుడి తర్కాలన్నీ ఒకే ఒక స్త్రీ భవనంముందు ఓడిపోతాయి.
హౄదయ సౌందర్యం లేని శరీర సౌందర్యం వ్యర్ధం.
మహిళ మహిమాన్వితం. మహిళాదినోత్సవం సందర్భంగా ప్రపంచపు మహిళామణులకు మహాభివాదాలు, మహాభినందనలు. శతసహస్ర ప్రణామాలు.

No comments:
Post a Comment