Thursday, March 6, 2008

హర శంకర శివ శంకర హర మే హర దురితం - శివరాత్రి శివార్చన
'శివా
'శివా నామానికి శుభం, క్షేమం, భద్రం, మంగళం, మోక్షం, శాంతి, నిర్మలత్వం (శుద్ధత) అని అనేకార్ధాల్లో ప్రముఖమైనవి. ఈ మంగళకర తత్త్వాల స్వరూపమే శివుడు. సత్యం, శివం, సుందరం లో మధ్యస్థమూర్తిత్వం. శివుని ఆరాధించిన వారికి ఈ ఫలాలన్నీ సిద్ధిస్తాయని విశ్వాసం. అందుకే శివపూజ భారతీయ జీవన శైలీ విధానంలో ప్రధానభాగం. శివపూజ ఐశ్వర్యకారకం. 'ఈశ్వరుడివ్వాలి - ఇల్లునిండాలీ అని నానుడి ఉందిగదా.
యశ్శివోనామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళాతయో:సంస్మరణాత్ పుంసాం సర్వతో జయ మంగళం.
శివాయ గురవే నమ:శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయనమశ్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనేగురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ:
సదా శివానుగ్రహం సదా లభించే నామాలు దుర్గతు తలగే దుర్గానామాలు
శివాయ నమ: ఆర్యాయై నమ:మహేశ్వరాయ నమ: దుర్గాయై నమ:రుద్రాయ నమ: వేద గర్భాయై నమ:విష్ణవే నమ: అంభికాయై నమ:పితామహాయ నమ: భద్రాయై నమ:సంసారవైద్యాయ నమ: భద్రకాళ్వై నమ:సర్వజ़్జాయ నమ: క్షేమ్యాయై నమ:పరమాత్మనే నమ: క్షేమంకర్యై నమ:
శివ పంచాక్షరి
తస్మై నకారాయ నమశ్శివాయతస్మై మకారాయ నమశ్శివాయతస్మై శికారాయ నమశ్శివాయతస్మై వకారాయ నమశ్శివాయతస్మై యకారాయ నమశ్శివాయ
శంకర భగవానుని 12 జ్యోతిర్లింగాలు
హిమాలయాల్లో కాంగడా ఘాట్ లలో 'జ్వాలాముఖీ అనే దివ్యస్థానం వుంది. పౄధ్వీగర్భం నుంచి నిరంతరం ప్రకాశవంతంగా ఉండే ఒక మహ్శ్ జ్యోతి అక్కడ కానవస్తుంది. సాక్షాత్తూ పరమేశ్వరుడు శుభంకరుడు - శంకరుడు ఆ తేజోమయ రూపంలో ప్రకటితమౌతాడు. ఆ పవిత్ర జ్యోతిని దర్శించడానికై భక్తజనసందోహం తండోపతండాలుగా రావడం విశేషం. జ్యోతి యొక్క ఈ అద్భుతం అనేక స్థానాల్లో కనిపిస్తుంది. ఆ స్థానాలవద్ద దర్శనార్ధం మేళాలు జరుగుతాయి. ఆ స్థానాలు ఇవి:
' సౌరాష్ట్రే సోమనాధంచ, శ్రీశైలే మల్లికార్జునంఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారేత్వమలేశ్వరంసరళ్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమశంకరంసేతుబంధేతురామేశం నాగేశం దారుకావనేవారణాస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటేహిమాలయేతు కేదారం ఘౄష్ణేశంచ విశాలకే."
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో - ఆంధ్రప్రదేశ్ లోని మల్లికార్జున స్వామి - శ్రీశైలం ప్రాభవం గురించి వేరే చెప్పనేల?
'శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం ధనసంపదాశత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే'
త్రిలింగ సంభూతమైన తెలుగునేల
మన దేశం తెలుగుదేశం. త్రిలింగ దేశం. పరమ శివుడు లింగాకారముతో మాఘ బహుళ చతుర్దినాడు ఉద్భవించినాడని మన పురాణాలు పేర్కొన్నాయి. అందుకే ప్రతీ యేట అదే రోజు రాత్రి, 'మహాశివరాత్రీ పర్వదినంగా జరుపుకుంటారు. శివాలయాల్లో, గౄహాల్లో అభిషేకాలు, అర్చనలు, పూజలు చేయడం రివాజు. ఉపవాస దీక్ష చేయడం, రాత్రంతా జాగరణ చేసి శివస్తోత్రాలు భక్తిపూర్వకంగా పారాయణ చేయడం ప్రత్యేకత. త్రిలింగ దేశమైన ఆంధ్రప్రదేశంలో మహావైభవంగా జరిగే త్రిలింగ క్షేత్రాలు - శ్రీశైలం, శ్రీ కాళహస్తి, ద్రాక్షారామం లు - మన ప్రదేశానికే మకుటాయమానంగా నిలిచాయి.
శ్రీకాళహస్తి

సువర్ణముఖీ నదీతీరమునగల ప్రసిద్ధ శివక్షేత్రం - వాయులింగం ప్రతిష్ట. చాలా ఎత్తుగానున్న ఆలయ మందిర గర్భాలయాన గాలి, వెలుగుతు తక్కువే అని చెప్పాలి. ఇచట ఈశ్వరుడు వాయువీచికారూపమున నివసిస్తాడు. ప్రత్యక్షంగా కానవచ్చే దౄశ్యంగా లింగం నలుపలకలుగా గోచరిస్తుంది. ఎదురుగా మహాభక్తుడకు 'కన్నప్పా చరిత్ర సుప్రసిద్ధం. కాళహస్తీశ్వరుడు దైవం. దేవీ జ़్జానప్రసూనాంబ. శివుని పంచలింగములలో ఒకటిగా చెప్పబడుతోంది. శివుని అష్టమూర్తుల్లో ఒకటి. శ్రీకాళహస్తి - శ్రీ (సాలెపురుగు), కాళ (సర్పం), హస్తి (ఏనుగు) మూడూ ఈశ్వరుని సేవించుటచే శ్రీకాళహస్తీశ్వరం గా మారింది. సువర్ణముఖీనదికి, లింగానికి పవిత్రపరమైన సంబంధం గా భావిస్తారు. సాలగ్రామాన్ని పూజించే యాత్రికులు కనీసం ఒక రాత్రి అయినా నివసిస్తారు. దక్షిణవాసులు కాశివలె పుణ్యక్షేత్రంగాను, దక్షిణకాశీగాను భావిస్తారు. ఈ క్షేత్రం గురించి 'సూతసంహితా లాంటి గ్రంధాల్లో ఎక్కువ వైభవంగా ప్రస్తావించబడింది. కైలాసగిరి అను పర్వతాన, 'మణికుండీశ్వరా మందిరం వుంది. మౄత్యువు సమీపించిన మానవుని మణికుండీశ్వరుని సమీపాన పరుడబెట్టడం కూడ రివాజు. కాశియందువలె యిచట కూడ ఆసన్న మౄత్యుడగు మనిషికి ఈశ్వరుడు తారకోపదేశం చేస్తారని ప్రజావిశ్వాసం. శివరాత్ర్ఫికి యిక్కడ ఏడురోజులపాటు ఉత్సవాలు జరపడం కూడ సంప్రదాయం. కొండపై దుర్గాలయం కూడ చూడదగ్గది. పూర్వం ఆలయ నిర్మాణ సమయంలో వేలకొలది కూలీలు నిత్యం పనిచేసి సాయంకాలానికి ఈశ్వరుని ప్రార్ధించి నదీతీరాన చిన్నగొయ్యి తియ్యగా అందులో ఆరోజుకు సరిపడే ద్రవ్యం లభించేదని కధనాలుగా చెప్పుకునేవారట. అందుకే సువర్ణముఖి అని సార్ధక నామం కలిగిందని కూడ చెప్తారు.
శ్రీశైలం

'శ్రీశైలం కాశి కేదారం కాళహస్తించ పట్టిసం, పంచక్షేత్రం పఠేన్నిత్యం మహాపాతక నాశనం'
'శ్రీశైలే శిఖరం దౄష్ట్వా పునర్జన్మ న విద్యతే'.
'శ్రిశైల శౄంగే వివిధ ప్రసంగే శేషాద్రి శౄంగేపి సదావనంతంతమర్జునం మల్లికాపూర్వమేనం నమామి సంసార సముద్రసేతుం.'
సుప్రసిద్ధ దివ్య శైవక్షేత్రం. మహారణ్య మధ్యమంలోనున్న ఈ సుక్షేత్రం చేరుకోడానికి అలనాడు మార్గాలు అనేకం. దేవాలయానికి దగ్గరలో ఉన్న కొలను ప్రసిద్ధి. పూర్వం పాండవులు ఈ దారినే రావడం, భీముడు యిక్కడకు వచ్చేసరికి దాహం వేయగా, తాగేందుకు నీళ్ళు లేకపోవడం చూసి, భీముడు కోపించి తన గదతో యిప్పుడు కొలను వున్నచోట మోదగా, ఆ దెబ్బకు అక్కడ చట్రాయి బద్దలై మడుగేర్పడగా, ఫలితంగా భీమునికొలను గా మారింది. శివరాత్రి సందర్భంగా కాకుండా, నిత్యసందర్శనం ప్రత్యేకం. భ్రమరాంబ, మల్లిఖార్జునుడు సన్నిధిలో పాతాళగంగ - కౄష్ణానది వుంది. కొండలమీదినుంచి చూడగా ఎక్కడనో పాతాళగంగ అని పేరు వచ్చింది. అందుకే, పాతాళగంగ అని పిలుస్తారు. క్షేత్ర మహాత్యం గురించి స్కాందపురాణంలో ప్రత్యేకఖండంగా వివరించారు. సమస్త పుణ్యనదుల అవతరణతో బ్రహ్మాదిదేవతలందరు యిందు సన్నిధి చేసియంటారని, సాక్షాత్పరమశివుడే యిందు స్వయముధ్భూతుడై వున్నాడని కూడ ప్రసిద్ధం. కామరూపాన్ని కల్పించే ఔషధాలు, సంజీవనీప్రభౄతి దివ్యౌషదాలు, వరుసవేది కూడ వున్నాయని పలువిరి భావన. సౄష్ట్యాదిలో శిలాదుడను మహర్షి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేయగా, పరమశివుడు మెచ్చి, కోరినట్లు పర్వతుడు, నందీశ్వరుడు అనే యిద్దరు కుమారులను అయోనిసంభూతులుగా ప్రసాదించారు. అందు పర్వతుడు తపస్సుచేసి పరమేశ్వరుని ప్రసన్నుని చేసికొని లింగాకారముగా తన పేరిట తన శిరస్సుపై ప్రాదుర్భవింపవలెననీ, ముల్లోకములలోగల పుణ్యపర్వతములు, పుణ్యతీర్ధములు, పుణ్యనదులు, పుణ్యాశ్రములు అన్నీ ఆయనతోనే వుండవలెననీ, తన శిఖర దర్శనము చేసిన వారికి పునర్జన్మ లేకుండ మోక్షము ప్రసాదింపవలెననీ వరములు కోరి పరమేశ్వరుని అనుగ్రహముచే తాను పర్వతాకారమును ధరించెను. అదే శ్రీశైలం. కనుకనే, 'శ్రీశైలే శిఖరం దౄష్ట్వా పునర్జన్మ న విద్యతే' అని ప్రతీతి. నందీశ్వరుడు తపస్సు చేసి ఆ పరమేశ్వరుని నిత్యం మోయాలని వరం కోరుకొని ఆ అనుగ్రహాన నంది వాహనమై నిత్యసేవలు చేయడం జరుగుతోంది. ఈ నందీకేశ్వరుడు తపస్సు చేసిన స్థలమఏ నందిమండలం గా, మహానందిగా, శ్రీశైలానికి నైరుతి దిశలో ఆ కొండలలోనే వుండడం అందరికీ తెలిసిన విషయమే. ఈ పర్వతానికి శ్రీశైలమని పూర్వం కౄతయుగంలో వసుమతి అనే మునికన్య వలన వచ్చింది అని చెప్తారు. వసుమతి యిక్కడ బ్రహ్మకై తీవ్ర తపస్సు చేయగా, ఆమె కోరినట్లుగా, ఆ పర్వతానికి ఆమె పేరు పెట్టడం జరగడం, ఆమెకు శ్రీ అనే పేరు పెట్టి ఆ పర్వతానికి శ్రీశైలం అని పేరువచ్చినట్లు అనుగ్రహించాడని పురాణకధనం. ఆ విధంగా శ్రీశైలం అయింది. పర్వతుడు కోరిన ప్రకారం, వెలసిన లింగం పర్వతలింగం అని ప్రసిద్ధి వహించడాం, చంద్రవతి అనే రాజపుత్రిక వలన మల్లికార్జునలింగం అనే పేరు రావడం జరిగింది. చంద్రవతి తెల్లని మల్లికాకుసుమాలతో ఈ లింగానికి పూజచేస్తూ, మల్లెపూలదండలను సమర్పిస్తూ ఆరాధించడంగా, ఆమె యెడల ప్రసన్నతతో పరమేశ్వరుడు ఆఅమె కోరిక ప్రకారం మలికా కుసుమాలను నిరంతరం శిరాన దాల్చుచు మల్లికార్జునుడయ్యాడు. శ్రీశైలానికి నాలుగు ద్వారాలు - ప్రాగ్ద్వారం (త్రిపురాంతకం - ప్రకాశం జిల్లా), దక్షిణ ద్వారం (సిద్దవటం - కడప జిల్లా), పశ్చిమద్వారం (ఆలంపూరు - కర్నూలు జిల్లా) మరియు ఉత్తర ద్వారం (ఉమామహేశ్వరం - నైజాం)కూడ మహాక్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. ఓరుగంటి ప్రతాపరుద్రమహారాజు (1100), కౄష్ణదేవరాయలు (1600) అభివౄద్ధిచర్యలు చేపట్టడం విశేషం. యిక్కడ మల్లికార్జునుడికి లింగాయతులు, పూజారులు, బ్రాహ్మణులు యిచ్చటనే నివాసం చేస్తూ నిత్యపూజలు నిర్వహించడం నేటికీ గమనిస్తూంటాం. శివరాత్రి పర్వదినానికి, కర్నాటకలోని అనేక ప్రాంతాలనుంచి, శ్రీశైల భ్రమరాంబకు తమ నివాసాలు పుట్టినిల్లనే విశ్వాసంతో వారు పుట్టింటి పసుపు, కుంకుమ చెల్లింపాలని, ఆ మొక్కుబడి ఈనాడు తీర్చుకోవడం ఆనవాయితీ. చైత్రపూర్ణిమకు కుంభోత్సవం, అమ్మవారి ముందర కుంభం, బలిహరణం మొదలైన పూజాకలాపాలు శాక్తేయంగా సంచరించడం కూడ సంప్రాదాయంగా వస్తోంది. చైత్రశుక్ల పంచమి నుంచి నవమి వరకు పాంచాహ్నిక దీక్షతో చండీయాగం జరపడం విశేషం. స్వామి సన్నిధిలో ప్రాకారానికి లోపల అనేక పుష్కరుణులు, కోనేరులు, బావులు - పూర్వం విష్ణ్వంశంగల సూర్యకిరణాలు సోకకుండ, వీరశైవులు బావులకు తాళాలు వేయడం పట్ల, వీటికి తాళాల బావులు అని పేరు వచ్చింది.
ద్రాక్షారామం

పంచారామాలుగా ప్రసిద్ధివహించిన - క్షీరారామం (పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా), అమరారామం (అమరావతి, గుంటూరు జిల్లా), భీమారామం (గుణుపూడి, పశ్చిమగోదావరి జిల్లా), కుమారరామం (సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా) మరియు ద్రాక్షారామం (ద్రాక్షారామం, తూర్పుగోదావరి జిల్లా) పంచారామాలు అన్నీ ఆంధ్రప్రదేశంలోనే వెలవడం విశేషమే కదా! ఈ దేవాలయాల్లోని లింగాలు, ఆలయ నిర్మాణ శైలి ఒకే తీరున వుండడం, ఈ ఆరామాల మాహాత్మ్యం, స్కాందపురాణంలో వర్ణింపబడ్డాయి. పంచారామాల్లో, సుప్రసిద్ధమైన ద్రాక్షారామం ఒకటి. ఈ ఆలయానికి ఎదురుగా 'సప్తగోదావరీ, పూర్వం మహర్షులు భీమేశ్వరునికి అభిషేకార్ధం గోదావరీనదియొక్క ఏడుపాయలను యిక్కడికి రప్పించారన్న విశ్వాసం ప్రకారం ఈ పేరు వచ్చిందట. నాలుగు దిశల్లో ప్రాకార సంభూతమైన ఈ ద్రాక్షారామంలో శ్వేత స్ఫటికలింగం ప్రసిద్ధి. అభిషేకాలు మేడపైన, మూలవిరాట్టు దర్శనం కిందనూ అవుతాయి. భీమేశ్వరుడు నిత్యం పెరుగుచుండడం వల్ల, బంగారుమేకు కొట్టారని, ఆ కారణంగా లింగం అయిదు శకలాలుగా అయ్యాయని, అవే నేటి పంచారామాలు అని చెప్తారు. మాణిక్యాంబ మందిరం మరువరాని అనుభూతి. కాలభైరవస్వామి, ఊరంతా శివలింగాలు, శివాలయాలు కనిపించడం విశేషం. వ్యాసుడు కాశిపై కోపించి,ఈ భీమేశ్వరుని చాలాకాలం అర్చించాడని కధనం. ప్రముఖ కవి, వేములవాడ భీమకవి ఈ స్వామి అనుగ్రహం కలిగి, చాలా సుప్రసిద్ధుడయ్యాడు.
కర చరణకౄతం వా కర్మవాక్కాయజం వాశ్రవణ నయనజం వా మానసం వా పరాధంవిహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వశివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో!
"మాఘకౄష్ణచతుర్దశ్యా మాదిదేవో మహానిశిశివలింగ తయోద్భూత: కోటిసూర్యసమప్రభ:తత్కాలవ్యాపినీ గ్రాహ్యా శివరాత్రివ్రతే తిధి:'
మాఘకౄష్ణ చతుర్దశినాటి మహారాత్రిని ఆదిదేవుడగు శివుడు లింగరూపాన కోటిసూర్యప్రభతో అవతరింఛడం జరిగింది. ఆ నాడు శివరాత్రివ్రతమాచరించడం రివాజు, సంప్రదాయం, సదాచారం.
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ, త న్నో రుద్ర: ప్రచోదయాత్.
శంకరం లోకశంకరం.
న జానామి యోగం జపం నైవ పూజాంనతోహం సదా సర్వదా దేవ తుభ్యంజరాజన్మ దు:ఖౌఘ తాతవ్యమానంప్రభో! పాహి సాఫా న్నమామీశ శంభో!

No comments: