Thursday, March 13, 2008

కమ్యూనిజ పితామహుడు 'కార్ల్ మార్క్స్ వర్ధంతి - 14 మార్చ్

కమ్యూనిజ పితామహుడు 'కార్ల్ మార్క్స్ వర్ధంతి - 14 మార్చ్
మనిషిని చేతకానితనం అనే ఇరుకు దశ నుంచి స్వాధీనత అనే విశాలమైన రాజ్యంలోకి తీసుకెళ్ళడమే సమాజవాదం కోరుకునేది.
మతం మానవ సమాజం పాలిట మత్తుమందు లాంటిది.
చారిత్రాత్మక సంఘటనలు రెండే రెండు సార్లు జరిగేది. మొదటి సారేమో - విషాదకరంగాను, రెండోసారి మాత్రం - హాస్యాస్పదంగానే.
యిజాలకి తలమానికం కమ్యూనిజం
ప్రపంచపు యిజాల్లో కమ్యూనిజంకు లభించిన ఘనత, గౌరవం వేరే శాఖకు లభించలేదంటే ఆశ్చర్యం కలగదు. కారణం ఈ సిద్దాంత సౄష్టికర్త, ప్రచారకుడు - కార్ల్ మార్క్క్స్. 1818 లో మే 5న జివిష్ దంపతులకు జర్మనీలోని ట్రైర్ లో జన్మించాడు. మార్క్స్ బెర్లిన్, బోన్, జేనా విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్రం, వేదాంతశాస్త్రం, మతశాస్త్రంల్లో విద్యను అభ్యసించాడు. జెన్ని వోన్ వెష్ట్ ఫాలెన్ ను వివాహం చేసుకున్నాడు. మతశాస్త్రంను ప్రత్యేక సరళిలో ఆధ్యయనం చేసినా, మానవుడి జేవనంలో మతానికి చోటు కల్పించలేదు. 20వ శతాబ్దపు రాజకీయ వ్యవస్థలపై మార్క్క్స్ తత్వమార్గం అధ్బుత ప్రభావం చూపింది. 19వ శతాబ్దపు యూరపు పెట్టుబడిదారుల రాజకీయ వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుభవంతో చివరికి మార్క్క్Xస్ 'పేద కార్మికశక్తిని రెచ్చగొట్టి, అణగత్రొక్కేందుకు, ఈ పెట్టుబడీదార్లవ్యవస్థ దారితీయడమే కాక, దాని చావుకు అదే దార్లు నిర్మించుకుంటోంది అని అన్నారు. 'కేపిటలిజం' నుంచి సహజంగా 'కమ్యూనిజం' వుద్భవించిందన్నారు. ఆయన ఖచ్చితమైన భావప్రకటనకు జర్మనీ, ఫ్ఫ్రాన్స్ రాజ్యాలనుంచి బహిష్కరించబడి, యింగ్లాండ్ లో స్థిరపడినాడు. ఫ్రెడ్రెక్ ఏంజెల్స్ తో కలసి 'కమ్యూనిష్ట్ మేనిఫెస్టో'ని (1848) ప్రచురించాడు. ఈ ప్రచురణ ద్వారా, అవసరమైతే, పెట్టుబడిదారీవ్యవస్థకు కారణమైన వారిని హింసాత్మకంగానైనా సరే, తరిమివేసి, సాంఘికంగా వారిని, వారి వ్యవస్థని బహిష్కరించాలని ప్రకటిస్తూ, ప్రముఖ నినాదం " ప్రపంచ కార్మికులారా! ఏకం కండి, ఐక్యతతో వర్ధిల్లండి!' అన్నది సౄష్టించబడింది. సామాజికవేదాంతంగా ప్రఖ్యాతమైన మార్క్స్ రచన 'దాస్ కేపిటళ్ (1867) ద్వారా, కమ్యూనిజవిప్లవం మొదటి దఫాగా పారిశ్రామికరాజ్యాలైన యింగ్లాండ్, ఫ్రాన్క్స్, జర్మనీల్లోస్థాపన జరగాలని తన స్వప్నంతో సంకల్పించాడు. అయితే, మార్క్స్ కు కొత్త అనుభవం ఎదురైంది. పారిశ్రామికంగా వెనుకబడిన రష్యాలాంటి రాజ్యాల్లో, మొదటి కమ్యూనిజపువిప్లవం ప్రముఖ నాయకుడు 'లెనిణ్ నాయకత్వంలో ప్రపంచంలో ప్రప్రధమంగా అవతరించింది. ఆంతకన్న ఆశ్చర్యపరచిన విషయం ఏమిటంటే,1990 ల్లో ప్రపంచ వ్యాప్తంగా పతనమైన కమ్యూనిజం వ్యవ్యస్థ,చైనా, క్యూబా, వియత్నాం లో మినహాయిస్తే, యీ యిరువురి నాయకుల కమ్యూనిజం సిద్ధాంతాలు క్రమేపీ తగ్గుతూ, అదౄశ్యమయి, అంతమయిపోయాయి. 14 మార్చి 1883 రోజున, లండన్ లో మరణించిన కార్ల్ మార్క్స్ భౌతికకాయాన్ని హైగేట్ శ్మశానవాటికలో లీనంచాయబడింది. మార్క్స్ భావాలు, సిద్ధాంతాలు కనుమరుగవుతున్నా, వారి ఆశలను, ఆశయాలను ప్రపంచ కార్మిక వ్యవస్థ ఉన్నంతకాలం, కార్ల్ మార్క్స్ ని మరవలేం. మరవకూడడు. ఆయన ఆత్మకు నిత్యనివాళి అర్పించడం విశ్వమానవాళి కనీస కర్తవ్యం.
రాహుల్ సాంకౄత్యాయన్ ఘటించిన శ్రద్ధాంజలి
మహా పండితుడు రాహుల్ సాంకౄత్యాయన్ బహుభాషా పండితుడు, రచయిత, చరిత్రకారుడు, గొప్ప తాత్త్వికవేత్త. ఆయన జీవితంలో అనంత విశ్వాంతరాళంలో నిరంతర యాత్రికుడిగా జీవించాడు. తన యాత్రలను, తనకు కలిగిన అనుభవాలను, విజ़్జానాన్ని గ్రంధ రూపంలో రాశాడు. రాహుల్ జీ బౌద్ద్యసారస్వతాన్ని లోతుగా ఆధ్యయనం చేసినా, మార్క్సిజం ప్రభావంతో భౌతికవాదిగా పరిణామం చెందాడు. లండన్ లో వుండగా, రాహుల్ కారల్ మార్క్స్ సమాధి వున్న హైగేట్ శ్మశానంలో ఆయన సమాధిని సందర్శించడానికి వెళ్ళాడు. కారల్ మార్క్స్ కు తన శ్రద్ధాంజలి ఘటించాలని ఆయన ఆశయం. వేల సమాధులున్న ఆ శ్మశానంలో, కారల్ మార్క్స్ సమాధి ఎక్కడో అతను గుర్తించలేక సమాధులవద్ద గేటుకు కాపలా వుండే చౌకిదారుతో, 'మార్క్స్ సమాధి ఎక్కడుంది?' అంటూ అడగ్గా, తెలియదు అని సమాధానం చెప్పాడు ఆ చౌకిదారు. వెంటనే యిలా అనుకున్నాడు.
'ఏ వర్గదాస్యాన్ని గొలగించడానికి తన అపూర్వమైన మేధాసంపదను వినియోగించి, అందుకోసం కటిక దారిద్ర్యాన్ని అనుభవించాడో, ఆయన సమాధి ఎక్కడున్నదో తెలియకపోవడం ఎంత విషాదకరమైన విషయం'. ఎంతలో అటునుంచి వస్తున్న వ్యక్తి ఆయనకి మార్క్స్ సమాధి చూపాడు. అది మామూలుగా గడ్డి మొలచి, సామాన్య వ్యక్తి సమాధిలాగే వుంది.
'ప్రపంచ శ్రామికుల పరిరక్షకుడు, తన జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవించిన ఆయన యిక్కడ విశ్రమించాడూ అనుకున్నాడు బాధగా - మార్క్స్ ను గుర్తుచేసుకుంటూ.
మహనీయుని జీవితంలో మరో మహనీయుని గురించిన మధురఘట్టం అంతే, యింతకంటే, సరియైన ఉదాహరణ వేరే ఏముంటుంది?

No comments: