ప్రపంచ నవ్వుల దినోత్సవం (ఈ రోజు) సందర్భంగా
నవ్వు వినా జీవితం వౄధా
మనిషి ఆలోచిస్తాడు - దేవ్వుడు నవ్వుతాడు, అని యూదు సామెత చాలా ప్రాముఖ్యం. దేవుడు నవ్వుతాడో లేడో మానవమాతృరులం మనకు తెలియదు కాని, మనుషులకు నవ్వుకు చాలా అవినాభావసంబందం వుంది అని మాత్రం ఖచ్చితంగా, నిర్ద్వందంగా చెప్పవచ్చు. జీవితంలో నవ్వులపాలయినవారు అనేకమంది నిత్యజీవితంలో తారసపడతారు. నిజానికి ప్రతీమనిషి, ఏదో సమయంలో, సందర్భంలో, నవ్వులపాలు కాక తప్పదేమోమరి. కేవలం మానవులం కదా! నవ్వు మాత్రం మనల్ని జీవితంలో వెంటాడే నీడ అనే చెప్పాలి. మనం నవ్వని రోజులన్నీ వూరికే వౄధా అయినట్లు అన్నాడోకవి. సూర్యోదయం నుంచి రాత్రి పవళింపు వరకూ మనం ప్రతినిత్యం జీవితంలో సతమతపడే రోజులో కొంత అలసటని తగ్గించి, ఉల్లాసం, ఊరట కలిగించే దినుసు నవ్వు. అందుకే అబ్రహాం లింకన్ నవ్వు ప్రాముఖ్యం చెప్పినతీరు చూడండి. - "రాత్రింబవళ్ళు నన్ను వేధించే వొత్తిళ్ళ మధ్య నేను కనీసం నవ్వకపోతే చచ్చిపోవల్సి వుంటుందీ అంటాడు. దీన్నిబట్టి, మనం జీవితంలో చాలారోజులు చచ్చిపోతూ, బతుకుతున్నట్లు కనిపిస్తాం అన్నది మాత్రం సత్యం. అలా అని, నేలబారు నవ్వులు రువ్వుకుంటే, అంతకన్న నేలబారు విషయం మరొకటి అంటూ వుండదు. నవ్వడానికి శక్తి వుంటే, ఎంతటి కష్టాలనైనా ఆడుతూ పాడుతూ ఎదుర్కొనగలం - అని అంటాడు, 'అతడు-ఆమె- అన్న రచనలో ప్రముఖ రచయిత లక్ష్మణరావు.
మనసుకి తేలిక - మెదడుకి ఆలోచన
నవ్వుకున్న, నవ్వుకలిగించే శక్తి అంతా యింతా కాదు. అదౄశ్యశక్తి. నవ్వేసెయ్యి, మనసు తేలికపడుతుంది, మెదడు ఆలోచించగలుగుతుంది - అని వైద్యుడు అందించే దివ్యౌషధంలా, 'ఓ గూటిపక్షులూ అన్న రచనలో రచయిత్రి సరస్వతీదేవి వక్కాణించారు.
మన నవ్వులు - ఆపాత మధురాలు
'నవ్వులు రువ్వే పువ్వమ్మా, నీ నవ్వులు నాకు యివ్వమ్మా' అని నవ్వుని వివరించిన చిత్రపునవ్వులు మనకు అగణితమైన చరిత్రను సౄష్టించాయి. నవ్వు అన్న పదానికి - హాసం, వికాసం తోపాటు పరిహాసం అని నిఘంటుకారులు వివరిస్తూ, అపహాసం, నవ్వులపాలు, నవ్వులాట అనికూడ మరికొన్ని టీకలు చెప్పారు.
మన పాత నవ్వులు యిలా సాగాయి.
నవ్వెనవ్వులు పువ్వులై నివ్వటిల్ల - రామాభ్యుదయం లో అయ్యలరాజ రామభద్రకవి అనుప్రాసాలంకారంలో నవ్వించాడు.నవ్వితిగాని పుట్టదు మనంబునమీదటిహాని ధీనిధీ - అని పంచతంత్రం చెప్పింది.నువ్వుపువ్వునవ్వు జవ్వని నాసిక - అని నవ్వే ముక్కుని వర్ణించాడు, విజయవిలాసం లో చేమకూరకవి.అలతినవ్వు ప్రగల్భతాహంకరణంబు, కాదు కాదు వాచావిగర్హణంబు, పలుకకుంట తిరస్కార కలనముద్ర - అని ఆయన శేలే శైలి అని నిరూపించుకున్న అపర శౄంగారకవినాధుడు, మధురకవి శ్రీనాధుడు.
నవ్వు - యోగం, భోగం
నవ్వు కేవలం భౌతికం కాదు. అపస్వరసంకేతసహితం కాదు. నవ్వు ఒక అనిర్వచనీయమైన యోగం. అసమాన భోగ్యవస్తువు. నవ్వటంలో ఒక సత్య పరిశీలనా దౄష్టి ఒకనీతిబోధ లేకపోలేదు - అని అంటారు, మన హాస్య నరసింహకవి, మునిమాణిక్యంవారు, 'మన హాస్యం' అన్న సమగ్ర హాస్యపరిశోధానాగ్రంధంలో.
నవ్వలేకపోవడం కేవలం రోగం, కాదు, అంటురోగం
పిచ్చెత్తకుండా వుండడంకోసమే నవ్వు - అని అంటాడు ప్రముఖ కవి బుచ్చిబాబు. అంతే కాదు సవివరణ యిచ్చాడు. "కష్టసమయంలోనే ఓర్పు, హాస్యదౄష్టి పనికి వస్తాయి; మనల్ని చూసి మనం కాసేపు నవ్వుకోగలిగేవాళ్ళే ఉత్తమశ్రేణి మానవులం" అని నిర్వచించాడు. నమ్మకాలు లేని మనిషి నవ్వలేడు, నవ్వలేని మనిషి బతకలేడు అంటూ మౄతసమానంగా భావించారు. ఏ ఆశా లేనివాడి నవ్వులో ఏడుపుంటుంది, ఒక్కోసారి ఎంతో అందం వుంటుంది అని దేవదాసు నవ్వులా - జగమేమాయ, బ్రతుకేమాయ అంటూ వేదాంతపు నవ్వులుకూడ మనముందు విసరబడ్దాయి. నన్ను చూసి వారు నవ్విన పక్షమున, వారిని చూసి నేను నవ్వెదను - అని అసూయాపరమైన నవ్వుని వికటంగా ప్రదర్శింపచేశారు, 'గణపతీ లో ప్రముఖ ప్రహసనకవి చిలకమర్తివారు. నవ్వు పైవారిలోనే అంటురోగం అయినప్పుడు, భార్యాభర్తల్లో కాకపోతుందా - అని పానుగంటివారు నవ్వుని సాక్షీకరింపచేశారు. అంతేకాదు, రుచికి లొట్ట ఎట్టిదో, వాచాలతకు వెర్రినవ్వ్వు అలాంటిది అని కూడ 'వెర్రినవ్వూని ప్రదర్శించారు.
ఈ నవ్వులే కొంపల్ని ముంచాయి!
కన్యాశుల్కం నాటకంలో మనకు ప్రముఖ వాక్యం - మధురవాణితో, ఆ నవ్వే కొంప ముంచింది, అని. ఆరోగ్యకరమైన, చిరస్మరణీయమైన నవ్వుని తన నాటకం ద్వారా గురజాడ వారు అందించారు. నాటకం అంతా, అరనవ్వుల్ని, ముసిముసినవ్వులతోపాటు పూర్తిస్థాయి నవ్వుల్ని రువ్వారు. ఎవ్వరైనా నవ్వితే, గోడకు వాల్ పోష్టరు అంటించినట్లుండకూడదు అంటారు (పురాణం). ఆడదాని నవ్వు అసహాయంగా వున్న మొగాణ్ణి ఎంతగా రెచ్చకొడుతుందో నిని(బీనాదేవి). మనదాకా రానంతవరకూ అన్నీ సరదాగానే వుంటాయి కదా. మగవాణ్ణి రెచ్చగొట్టే, ఆడదాని నవ్వుని నిర్వచించడం, ఆ సౄష్టికర్త బ్రహ్మకైనా వశమా! అయితే, వనితాలంకారభూషితంగా నవ్వుని - నుదుటి బొట్టులా, ముక్కు పుడకలా, సిగలో పువ్వులా, ముఖానికి నవ్వు పమిటకు జలతారంచులాంటిది అని అంటారు, పురాణంవారు (నా పట్టుచీరా కన్నతల్లీ).
అచం'చలం' చుట్టిముట్టిన నవ్వులు
నవ్వులో, గొప్ప నవ్వులో వున్న ఔన్నత్యం దేంటో వుంటుంది? అందువల్లనే షేక్స్క్పియర్, కాళిదాసు, గొప్ప వేదాంతాన్ని కోర్ట్ ఫూల్స్ చేతా, విదూషకుల చేతా మాట్లాడించారు; పి.జి.ఉడ్ హౌస్ నవ్వులో, డిక్కెన్సు, కారికేచర్స్ లో, చార్లీ చాప్లిన్ చిత్రాలలో ఎన్ని కన్నీళ్ళూ? ఎంత వేదాంతం? అని విశ్వభరితంగా నవ్వుల్ని తుంగచుట్టారు, మన సాహితీ హిమా'చలం' అచం'చలం', గుడిపాటి వెంకటాచలం, తన అద్భుతసౄష్టి - మ్యూజింగ్స్ లో.
నవ్వులతో సాధ్యాసాధ్యాలు
ఏదైనా పని సాధ్యమా, అసాధ్యమా అంటే చెప్పడం కష్టం. నవ్వుకూడా అంతే. చెప్పడం తేలిక. నవ్వినట్లుచేయడం కష్టం. నవ్వాపుకున్నట్లు చెప్పినట్లు చేస్తే దరహాసం. లేకుంటే తప్పదు పరిహాసం - అన్నాడో ప్రవాసాంధ్రకవి. అచ్చతెలుగు కవులకన్న అచ్చుబంగారంలా చెప్పాడు.
ఒకేకవి చెప్పిన నానాజాతి నవ్వులు
నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవౄత్తికిన్ దివ్వెలు, కొన్ని నవ్వు లెటు తేలవు, కొన్ని విషప్రయుక్తముల్, పువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు విశుద్ధమైన లేనవ్వులు, సర్వదు:ఖ దమనంబులు వ్యాధులకున్ మహౌషధుళ్ అని పలవరించిన తీరు వర్ణించనలవికానిది - గుర్రం జాషువా గారిది.
'నవ్వూకళాపూర్ణోదయం
నవరసాల్లో నవ్వు (హాస్యం) నాణ్యం. నవ్వే మనిషికి ముద్దు, కానీ నవ్వులపాలు కావద్దు అన్నారు సి.నారాయణరెడ్డిగారు. యింతకీ నవ్వని వాళ్ళెవరు? ఎప్పుడు చూసినా ముఖం ముడుచుకుని కూర్చునే వాళ్ళుకూడా ఆయా సందర్భాల్లో లోలోపల నవ్వుకోకుండా వుండలేరు అని లోనవ్వుల్ని కూడ ఆవిష్కరించారు సినారె. నవ్వలేనివాడు నాగరికుడు కాడు; నవ్వు మనిషిలోని తమస్సును కరగతీస్తుంది; రజస్సుని తొలగదోస్తుంది; సాత్త్విక తేజస్సును వెలిగితీస్తుంది; చీకటి రాత్రి ముగిసి ఉషస్సు మొలిచినట్లుంటుంది. మనసుకు మందహాసం మానవతను చిగురింపచేసే మధురౌషధం. (కీ.శే. జి.వి.సుబ్రహ్మణ్యం, ప్రముఖ భాషాపండితులు, విమర్శకులు).
అవమానాన్నీ, క్రోధాన్నీ ఎదుర్కోగల ఒకేఒక ఆయుధం చిరునవ్వు - గాంధీజీ.
హాస్యాన్ని సౄష్టించడానికి మూడేమూడు సూత్రాలున్నాయి - దురదౄష్టవశాత్తు అవి ఎవరికీ తెలియవు - అన్నాడో ప్రముఖ హాస్యవేత్త.
నవ్వుల గురించి సమగ్రంగా వివరించడం, విశ్లేషించడం, నవ్వులాట కాదు. నవ్వులగురించి మొదలు పెడితే, నవ్వులపాలు అవడం, జనాలు విరగబడి నవ్వడం జరిగితీరుతాయి.
'యధేఛ్ఛసి తధా కురూ - నీకు ఏది యిష్టమో అది చేసుకో, అని గీతాచార్యుడు భాష్యం చెప్పినట్టు, ఓ మానవుడా! నీకు ఎలా నచ్చితే, నప్పితే, అలా నవ్వుకో! ఎంత సముద్రం మీద ఎగిరినా, పక్షి రాత్రి గూటికి చేరిన, జాతీయత, సంప్రదాయ చందాన, గూటికి చేరుకుని, విశ్రమించేలోపున, మనసారా, తనివితీరా, వాచా, కర్మణా, నవ్వుకోవాలి. నవ్వుకో, ఓ మానవుడా! గనులు గనులుగా నవ్వులు తవ్వుకో! ఆహా! ఆహాహాహా! ఆహాహా!
నవ్వే సమస్త సన్మంగళాని భవంతు! సర్వేజనా సుఖినోభవంతు!
ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా, తిరుగులేని, మాటిమాటికీ, ముమ్మాటికీ, తిరిగివచ్చే నవ్వుల్ని రువ్వుకోండి మహాప్రభో!

1 comment:
కొంపెల్ల శర్మ గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
Post a Comment