Tuesday, February 19, 2013

నాడు - ఈనాడు,



వికీపీడియా:చరిత్రలో రోజు - ఫిబ్రవరి 19


·         1630   మరాఠా సామ్రాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ భోంస్లే జననం/శివ జయంతి
  • 1700: డెన్మార్క్ లో జూలియన్ కేలెండర్ ఆఖరి రోజు
  • 1819: బ్రిటిష సాహసికుడు విలియం స్మిత్. 'సౌత్ షెట్లాండ్ దీవులను' కనుగొని, వాటికి హక్కుదారులుగా , 'కింగ్ జార్జి ĪĪĪ' పేరు పెట్టాడ
  • 1831: అమెరికాలోని, పెన్సిల్వేనియాలో, మొదటిసారిగా బొగ్గుతో నడిచే రైలు యంత్రాన్ని ప్రయోగాత్మకంగా నడిపారు.
  • 1836 రామకృష్ణ పరమహంస జయంతి (గ్రెగేరియన్ కాలండర్ ప్రకారం జననం 18 ఫిబ్రవరి 1836 )
  •  
  • 1856: టిన్ టైప్ కెమెరాకి హామిల్టన్ స్మిత్ పేటెంట్ పొందాడు (గేంబియర్, ఓహియో).
  • 1861: రష్యన్ జార్ చక్రవర్తి అలెగ్జాండర్ -2 సెర్ఫ్ డం (రష్యాలోని బానిస రైతు విధానం - వెట్టి చాకిరి తో సమానం) ని రద్దు చేసాడు.
·         1878   థామస్ ఎడిసన్ ‘ఫోనోగ్రాఫ్’ కోసం పేటెంట్ ని పొందాడు.
·         1915    భారతీయ సామాజిక, రాజకీయ నాయకుడు గోపాలకృష్ణ ఘోఖలే మృతి

·         1919    ప్రముఖ మరాఠీ రచయిన అరవింద ఘోఖలే ముంబాయిలో జననం

·         1930   భారతీయ చలనచిత్ర దర్శకుడు, నటుడు కాశీనాథుని విశ్వనాథ్ జననం

·         1933   ప్రష్యాలో కేథలిక్ దినపత్రికలపై నిషేధం విధింపు

·         1941    ప్రముఖ తెలుగు రచయిత జయంతి రామయ్య పంతులు మృతి
  • 1956: ఆచార్య నరేంద్ర దేవ్ మరణించాడు.
·         1964   భారతీయ చలనచిత్ర నటి సోనూ వాలియా జననం
  • 1969: బోయింగ్ 747 జంబో జెట్ ని మొట్ట మొదటిసారి ప్రయోగాత్మకంగా నడిపి చూసారు.
  • 1970: స్పుత్నిక్ 52, మొల్నియ 1-13 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను సోవియట్ రష్యా ప్రయూగించింది.
  • 1976: ఫ్రెంటె పోలిసారియో - డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ సహారా గా అవతరించింది.
  • 1977: షటిల్ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ 747 జెట్ లైనర్ ని ఆకాశంలోకి ప్రయోగాత్మకంగా పరిశీలించింది.
  • 1982: బోయింగ్ 757 అనే విమానం మొట్ట మొదటిసారిగా ఆకాశంలో ఎగిరింది.
  • 1984: 14 వింటర్ ఒలింపిక్స్ యుగోస్లావియా లోని సరజెవో నగరంలో ముగిసాయి.
  • 1985: స్పానిష్ జెట్ లైనర్, స్పెయిన్ లోని 'బిల్బావొ' దగ్గర కూలి 150 మంది మరణించారు.
  • 1985: ఆమ్ స్టర్ డామ్ లోని .డి.ఎమ్. దివాళా తీసినట్లు ప్రకటించింది.
  • 1985: కృత్రిమ గుండె పెట్టుకున్న విలియం జె. స్క్రోడర్, ఆసుపత్రిని వదిలి బయటి ప్రపంచానికి వచ్చిన మొదటి మనిషి.
  • 1985: కోకా కోలా మొదటిసారిగా చెర్రీ కోక్ ని సీసాలలోను, డబ్బాలలోను (టిన్డ్) ప్రవేశపెట్టింది.
  • 1985: లైబీరియా ఏయిర్ లైన్స్ కి చెందిన బోయింగ్ 727 స్పెయిన్ లోని ఓయిజ్ పర్వతం (మౌంట్ ఓయిజ్) లో కూలిపోయి, 148 మంది ప్రయాణీకులు మరణించారు.
  • 1985: ప్రపంచ ప్రసిద్ధి పొందిన మికీ మౌస్ ని చైనా దేశం లోనికి ఆహ్వానించారు.
  • 1986: సోవియట్ యూనియన్ (నేటి రష్యా) 'మీర్' అనే రోదసీ కేంద్రం (స్టేషన్) ని రోదసీలోకి పంపింది.
  • 1990: సోయుజ్ టి.ఎమ్-9 (రష్యన్ రోదసీ నౌక పేరు) భూమి మీద దిగింది.
  • 1997: చైనా కమ్యూనిస్ట్ నాయకుడు, సంస్కర్త డెంగ్ జియావోపింగ్ మరణం. (92 ఏట)
  • 1998: సోయుజ్ టి.ఎమ్-26 (రష్యన్ రోదసీ నౌక పేరు) భూమి మీద దిగింది.
  • 1999: నేపాల్ పోలీసులు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఎనిమిది మంది ప్రదర్శకులను చంపారు
  • 2002: నాసా కుజగ్రహానికి పంపిన 'మార్స్ ఒడిస్సీ రోదసీ నౌక' "థెర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టం" ని ఉపయోగించి కుజగ్రహం యొక్క భూతలపు పటాల్ని తయారుచేయటం మొదటిసారిగా మొదలు పెట్టింది.
·         2008  1959 నుంచి అధికారంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో పదవికి రాజీనామా
 

No comments: