Thursday, June 19, 2008

మన సంస్కౄతీక్షరాలు

తెలివితేటలున్నా మనం తెల్లవారనిస్తున్నాం
మన మేధస్సుల్ని మనమే ఎగుమతి చేసుకుంటున్నాం
మన పంటసిరులుకి మనమే తెగుళ్ళని అందిస్తున్నాం
తెలుగురైతులాగ తెలుగు సంస్కౄతీవైభవాలకు కూడ
కరువు, కాటక, వరద, భీభత్సాలను సౄష్టిస్తున్నాం
మన సంస్కౄతీసంస్కారాలకు దహనసంస్కారం కావిస్తున్నాం
మన జీవితకవితలను నిషిద్ధచందోరహితం చేస్తున్నాం
కుంటిసాకుల్ని, కుహనానడతల్ని మననం కావించుకుంటున్నాం
హావభావాల్ని హాహాకారాల్తో నిశ్శబ్దతరంగాల్ని రువ్వుతున్నాం
విచక్షణలేని వివాదాల్లోకి వికటంగా విహారం చేస్తున్నాం
మన భాషకు మనమే వక్రభాష్యాన్ని రచిస్తున్నాం
మన అక్షరాలకు మనమే క్షరత్వాన్ని ప్రసాదిస్తునాం.

కొంపెల్ల శర్మ - తెలుగురధం.

2 comments:

Kathi Mahesh Kumar said...

మీ ఆవేదన అర్థమవుతోంది, కానీ అర్థవంతంగా లేదనిపిస్తోంది.

మొదటగా,స్కూలు కాలేజి,విశ్వవిద్యాలయాలలో పుట్టుకొస్తున్న మన మేధస్సు ఎలాగూ ఎగుమతికి తప్ప మనకు పనికిరాదు http://parnashaala.blogspot.com/2008/06/blog-post_08.html.ఈ ఎగుమతితో మనోళ్ళు డాలర్లు దిగుమతి చేసి జీవనస్థాయిని పెంచుకుంటున్నారు కాబట్టి దాని మీద అంత ఆవేదన అనవసరం.

ఇక మన సంస్కృతీ,సాహిత్యానికి పట్టిన తెగులు మన జీవనవిధానంలోనిదే...దానిగురించి అర్థం చేసుకోవడానికి ఈ క్రింది లంకెలు వాటిలో జరిగిన చర్చలూ ఉపయోగపడగలవు. చూడండి.
http://parnashaala.blogspot.com/2008/06/blog-post_17.html

http://parnashaala.blogspot.com/2008/05/blog-post_09.html

Unknown said...

అయ్యా, కత్తి గారు - మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. అయినా, ఎవరి భావాలు, అనుభవాలు వారివి. అన్వయం కుదరదు కదా. మీరు చెప్పిన వ్యాసాలు తప్పక చదువుతాను. కాని నేను మీలాగా ప్రతిస్ఫందీంచను.